చండుడు వచ్చేస్తున్నాడంటున్న కన్నప్ప టీమ్‌!

మంచు విష్ణు డ్రీమ్‌ ప్రాజెక్ట్‌ కన్నప్ప నుంచి ప్రతి సోమవారం ఓ అప్డేట్ వస్తుందని ప్రకటించిన సంగతి తెలిసిందే. చెప్పినట్టుగానే విష్ణు మంచు తన సినిమా నుంచి ప్రతి సోమవారం ఒక అప్డేట్‌ను విడుదల చేస్తున్నారు. సినిమాలోని విభిన్న పాత్రలను పోషించిన దిగ్గజ నటీనటుల పోస్టర్‌లను విడుదల చేస్తూ క్యూరియాసిటీ పెంచేస్తున్నారు.

ఇప్పటికే ఈ సినిమా నుంచి మధుబాల, శరత్ కుమార్, దేవరాజ్ వంటి వారు పోషించిన పాత్రలకు సంబంధించిన పోస్టర్‌లను విడుదల చేసి సినిమా మీద భారీ అంచనాలు పెంచేశారు. తాజాగా ఈ మూవీలో నటుడు సంపత్ పోషించిన పాత్రకు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్‌ను చిత్ర బృందం విడుదల చేసింది. ”అడివినే భయాభ్రాంతుల్ని చేసే భీకర జాతి.. నల్ల కనుమ నేలలో పుట్టారు.. మొసళ్ల మడుగు నీరు తాగి పెరిగారు.. భిల్ల జాతి అధినేత చండుడు అంటూ భీకరమైన పోస్టర్‌ను చిత్ర బృందం విడుదల చేసింది.

నటుడు సంపత్ ఈ క్యారెక్టర్‌లో అందరినీ మెప్పించేలా కనిపిస్తున్నారు. గెటప్ చాలా కొత్తగా కనిపిస్తోంది. కన్నప్ప చిత్రంలో డా.మోహన్ బాబు, మోహన్ లాల్, ప్రభాస్, బ్రహ్మానందం, బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ భాగమైన సంగతి అందరికీ తెలిసిందే. “కన్నప్ప” సినిమాటిక్ ఎక్స్‌పీరియెన్స్ ఇచ్చే విజువల్ వండర్‌గా రాబోతోంది. విష్ణు మంచు కన్నప్ప పాత్రను పోషిస్తున్నారు. మోహన్ బాబు స్వయగా నిర్మిస్తున్న ఈ సినిమాకి ముఖేష్ కుమార్ సింగ్ డైరెక్ట్ చేస్తున్నారు. ఈ పాన్ ఇండియా ప్రాజెక్ట్ షూటింగ్ చివరి దశకు చేరింది. త్వరలోనే పూర్తి చేసి ప్రమోషన్ కార్యక్రమాలను మొదలు పెట్టనున్నారు. ఈ సినిమా డిసెంబర్‌ లో ప్రేక్షకుల ముందుకు రానున్నది.

Related Posts

Comments

spot_img

Recent Stories