కన్నప్పకు సెన్సార్ కష్టాలు!

టాలీవుడ్‌లో రూపొందుతున్న భారీ ప్రాజెక్ట్స్‌లో విష్ణు మంచు నటిస్తున్న “కన్నప్ప” సినిమాపై ఇప్పటికే ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఏర్పడ్డాయి. మైథలాజికల్ బ్యాక్‌డ్రాప్‌లో రూపొందుతున్న ఈ చిత్రాన్ని ముఖేష్ కుమార్ సింగ్ డైరెక్ట్ చేస్తున్నారు. ఇప్పటివరకు రిలీజ్ చేసిన టీజర్లు, పోస్టర్లు ఈ సినిమాపై మరింత హైప్‌ తీసుకొచ్చాయి. దాంతో ప్రేక్షకుల్లో ఆసక్తి రోజురోజుకీ పెరుగుతోంది.

ఇప్పటికే రిలీజ్ తేదీ దగ్గరపడుతోందన్న కారణంతో, సినిమా సెన్సార్ దశను చేరుకుంది. అయితే ఇప్పుడు ఈ సినిమాకు కొన్ని వివాదాలు చుట్టుముట్టినట్టు సమాచారం. సినిమాలో ఉన్న కొన్ని సన్నివేశాలు బ్రాహ్మణ వర్గానికి అభ్యంతరకరంగా ఉన్నాయని బ్రాహ్మణ చైతన్య వేదిక అభిప్రాయపడినట్టు తెలుస్తోంది. ఈ విషయంపై సెన్సార్ బోర్డు కూడా సీరియస్‌గా స్పందించినట్టు సమాచారం.

సెన్సార్ సభ్యులు సినిమాను పూర్తిగా వీక్షించిన తర్వాత, దాదాపు 13 సన్నివేశాలపై అభ్యంతరం వ్యక్తం చేసినట్టు ఇండస్ట్రీలో టాక్ నడుస్తోంది. అందులోని కొన్ని డైలాగులు, సన్నివేశాలు సున్నితమైన అంశాలకు సంబంధించి ఉండటంతో, అవి తొలగించాల్సిందిగా సినిమా టీమ్‌కు సూచించినట్టు తెలుస్తోంది.

ఇప్పుడు అందరి దృష్టీ చిత్ర యూనిట్ ఎలా స్పందిస్తుందన్న దానిపైనే ఉంది. జూన్ 27న విడుదల కాబోతున్న ఈ సినిమాకు మోహన్ బాబు భారీ ఖర్చుతో నిర్మాణ బాధ్యతలు తీసుకున్నారు. మథ్యకాలపు పవర్‌ఫుల్ కథతో రాబోతున్న “కన్నప్ప” పాన్ ఇండియా లెవెల్లో పెద్ద అంచనాలు క్రియేట్ చేయడంలో ఇప్పటికే సక్సెస్ అయ్యింది. కానీ ఇప్పుడు ఈ సెన్సార్ వివాదం సినిమా రేంజ్‌కి ఎలాంటి ప్రభావం చూపుతుందో చూడాలి.

Related Posts

Comments

spot_img

Recent Stories