డిసెంబర్‌ లో రాబోతున్న కన్నప్ప!

మంచు విష్ణు డ్రీమ్‌ ప్రాజెక్ట్‌ అయిన కన్నప్ప సినిమాని ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తున్నారు. ఈ సినిమాని మహాభారతం సీరియల్ కు దర్శకత్వం వహించిన ముఖేష్ కుమార్ సింగ్ తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాను కలెక్షన్ కింగ్ మోహన్ బాబు భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్నారు. బిగ్గెస్ట్ పాన్ ఇండియా మూవీగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో ప్రభాస్,అక్షయ్ కుమార్ ,మోహన్ లాల్ ,శివ రాజ్ కుమార్ వంటి పాన్ ఇండియా స్టార్స్ కీలక పాత్రలు చేస్తున్నారు.

ఈ ప్రతిష్టాత్మక చిత్రానికి మెలోడీ బ్రహ్మ మణిశర్మ, స్టీఫెన్ దేవసి  సంగీతాన్ని అందిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. ఇదిలా ఉంటే రీసెంట్ గా ఈ సినిమా టీజర్ ను చిత్ర బృందం విడుదల చేసింది. విడుదల అయిన ఈ టీజర్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటుంది. తాజాగా ఈ టీజర్ 7 మిలియన్ వ్యూస్ సాధించినట్లుగా చిత్ర యూనిట్ స్పెషల్ పోస్టర్ విడుదల  చేసింది.

ఇదిలా ఉంటే ఈ సినిమాను మంచు విష్ణు డిసెంబరులో రిలీజ్ చేసే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం. అయితే ఈ చిత్రం వీఎఫెక్స్ పూర్తయితేనే డిసెంబర్ లో విడుదల అయ్యే అవకాశం ఉంటుంది. లేకపోతే వచ్చే ఏడాదిలోనే విడుదల సాధ్యం కానుంది. అయితే ఈ సినిమా టీజర్ బాగున్నప్పటికీ కూడా విఎఫ్ఎక్స్ వర్క్ పై కొన్ని ట్రోల్స్ రావడంతో దాని గురించి విష్ణు పూర్తి దృష్టి సారించనున్నట్లు తెలుస్తుంది.

Related Posts

Comments

spot_img

Recent Stories