కన్నప్ప రికార్డు బ్రేకింగ్‌!

తెలుగు ఇండస్ట్రీలో చాలా కాలంగా సరైన హిట్ కోసం ఎదురుచూస్తున్న మంచు విష్ణు, ఈసారి కన్నప్ప అనే చిత్రంతో బిగ్ అటెంప్ట్ చేశాడు. జిన్నా తరువాత చాలా గ్యాప్ తీసుకుని ఎంతో ఉత్సాహంగా, ఆకర్షణీయమైన కధనంతో ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చాడు. పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కిన ఈ చిత్రానికి ముకేష్ కుమార్ దర్శకత్వం వహించగా, భారీ తారాగణంతో సినిమాను నిర్మించారు.

ప్రేక్షకుల్లో మొదటినుంచే మంచి అంచనాలు నెలకొల్పుకున్న ఈ చిత్రం, విడుదలైన మొదటి రోజే ఆకట్టుకునే రెస్పాన్స్ అందుకుంది. పీఆర్ వర్గాల నుంచి వచ్చిన సమాచారం ప్రకారం, ఈ సినిమా మొదటి రోజు ప్రపంచవ్యాప్తంగా దాదాపు 20 కోట్ల గ్రాస్ వసూళ్లు రాబట్టినట్టు చెబుతున్నారు. ఇది మంచు విష్ణు కెరీర్ లో ఇప్పటివరకు లభించిన అత్యధిక ఓపెనింగ్ అని చెప్పవచ్చు.

అంతేకాదు, మొదటి రోజు ఆకట్టుకున్న రీస్పాన్స్ తర్వాత రెండో రోజుకూ కన్నప్ప మంచి బుకింగ్స్‌తో దూసుకెళ్తోంది. ఈ ట్రెండ్ చూస్తే, వసూళ్లు రాబోయే రోజుల్లో మరింత పెరిగే అవకాశం ఉంది. మొత్తంగా చూస్తే, కన్నప్ప సినిమాతో మంచు విష్ణు మళ్లీ ప్రేక్షకుల మనసుల్లోకి వచ్చాడని చెప్పొచ్చు. ఇది ఒక రికార్డు స్థాయి రీ ఎంట్రీగా పరిశ్రమలో చర్చనీయాంశంగా మారింది.

ఈ మూవీని చూసిన ప్రేక్షకులు కథ, విజువల్స్, నటనపై మంచి స్పందన అందిస్తుండగా, క్రిటిక్స్ నుంచి కూడా మిశ్రమ స్పందన వచ్చినప్పటికీ వసూళ్ల పరంగా మాత్రం సినిమా బలంగా నిలుస్తోంది. పాన్ ఇండియా రేంజ్‌లో ఓ మిడ్ రేంజ్ హీరో నుంచి ఇలాంటి రిస్పాన్స్ రావడం విశేషం. ఇప్పుడు మిగిలిన రోజుల్లో ఈ సినిమా ఏ స్థాయికి వెళ్లబోతుందో చూడాలి.

Related Posts

Comments

spot_img

Recent Stories