ఓటీటీలోకి కన్నడ బ్లాక్‌ బస్టర్‌!

కన్నడ సినిమాలు ఇటీవల వరుసగా మంచి విజయాలు అందిస్తున్నాయి. ఆ జాబితాలో కొత్తగా చేరిన సినిమా “సు ఫ్రమ్ సో”. ఈ చిత్రాన్ని రాజ్ బి శెట్టి నిర్మించగా, జెపి తుమినాడ్ దర్శకత్వం వహించారు. హారర్, కామెడీ కలయికగా వచ్చిన ఈ సినిమా అక్కడి ప్రేక్షకులను బాగా ఆకట్టుకుని బాక్సాఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది.

అయితే అదే సినిమాను తెలుగులో విడుదల చేసినప్పటికీ, ఇక్కడ మాత్రం పెద్దగా స్పందన రాలేదు. థియేటర్లలో ఆశించినంత స్థాయి విజయాన్ని సాధించకపోయినా, ఇప్పుడు డిజిటల్ ప్లాట్‌ఫారమ్ ద్వారా ప్రేక్షకులను కలవడానికి సిద్ధమైంది.

ఈ చిత్రానికి సంబంధించిన స్ట్రీమింగ్ హక్కులు జియో హాట్‌స్టార్ తీసుకున్నాయి. ఈ నెల 9వ తేదీ నుంచి ఈ సినిమా ఓటీటీలో అందుబాటులోకి రాబోతుంది. మొదటగా 5న రిలీజ్ చేయాలని ప్లాన్ చేసినా, కొన్ని కారణాల వల్ల ఆలస్యం అయ్యింది. ఇక ఇప్పుడు హాట్‌స్టార్‌లో ఒకేసారి మూడు భాషల్లో ఈ సినిమాను ప్రసారం చేయనున్నట్టు అధికారికంగా తెలియజేశారు.

Related Posts

Comments

spot_img

Recent Stories