ఓజీ సెకండ్‌ సింగిల్‌ కోసం కన్మణి ఎదురు చూపులు!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా తెరకెక్కుతున్న ‘ఓజి’ సినిమా ప్రమోషన్స్‌ను చిత్రబృందం మొదలుపెట్టింది. ఇప్పటికే షూటింగ్ పూర్తిచేసుకున్న ఈ ప్రాజెక్ట్‌ను దర్శకుడు సుజీత్ ప్యూర్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందిస్తున్నాడు. ఈ మూవీని సెప్టెంబర్ 25న థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల చేయడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి.

ఈ క్రమంలో, హీరోయిన్ ప్రియాంక మోహన్ పుట్టినరోజు సందర్భంగా ఆమె ఫస్ట్ లుక్‌ను బయటపెట్టారు. సినిమాలో కన్మణి అనే పాత్రలో కనిపిస్తున్న ఆమె క్యూట్ లుక్స్ పోస్టర్స్‌లో ఆకట్టుకున్నాయి. దీంతో అభిమానులు సోషల్ మీడియాలో ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

ఇదే సమయంలో, సినిమా మ్యూజిక్‌పై కూడా ఓ అప్డేట్ ఇచ్చారు. రెండో సింగిల్ ప్రోమో త్వరలోనే రాబోతోందని యూనిట్ తెలిపింది. ఈ పాట ఎమోషనల్ టచ్‌తో ప్రేక్షకులను బాగా కనెక్ట్ చేస్తుందని చెబుతున్నారు. ప్రియాంక కూడా తన పాత్రకు ఈ పాట ప్రత్యేకంగా నచ్చిందని పేర్కొంది. మరోవైపు సంగీత దర్శకుడు థమన్, కన్మణి పాత్రతో పాటు ఈ సాంగ్ కూడా ప్రేక్షకుల మనసుల్లో ఎక్కువకాలం నిలిచిపోతుందని విశ్వాసం వ్యక్తం చేశాడు.

Related Posts

Comments

spot_img

Recent Stories