కంగువా వాయిదా పడిందా..మరి కొత్త డేట్ ఎప్పుడంటే!

ప్రస్తుతం మన సౌత్ నుంచి విడుదలకు రెడీ గా ఉన్న తాజా చిత్రాల్లో కోలీవుడ్ స్టార్ హీరో సూర్య,  హీరోయిన్‌ దిశా పటాని హీరో హీరోయిన్లుగా దర్శకుడు శివ తెరకెక్కించిన భారీ విజువల్ అండ్ యాక్షన్ డ్రామా సినిమా “కంగువా” కూడా ఒకటి. మరి ఈ సినిమాని కూడా రెండు భాగాలుగా మేకర్స్ ప్లాన్ చేయగా ఈ ఏడాది దసరా కానుకగా విడుదలకి రెడీ అయ్యింది.

అయితే ఈ సినిమాని ఎంతో కాలం అవైటెడ్ గా ఉంచి అక్టోబర్ 10 డేట్ ని ప్రకటించారు. ఈ తర్వాత తలైవర్ “వేట్టైయన్” ని ప్రకటించారు.
దీంతో భారీ క్లాష్ కన్ఫర్మ్ అయ్యింది. కానీ ఇప్పుడు తాజా అప్డేట్‌ ఏమిటంటే ఈ క్లాష్ నుంచి కంగువా తప్పుకుంటుంది అని స్ట్రాంగ్ బజ్ వినిపిస్తుంది.

 దీంతో సూర్య సినిమా అక్టోబర్ 10 నుంచి తప్పుకొని అదే నెల 31 కి షిఫ్ట్ అవుతున్నట్టుగా సమాచారం. దీనికి కారణం సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు అనుకున్న టైం కి పూర్తి కాకపోవడమే అనే సమాచారం జోరుగా సాగుతుంది. మరి దీనిపై అధికారిక క్లారిటీ అయితే రావాల్సి ఉంది. ఇక ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తుండగా స్టూడియో గ్రీన్, యూవీ క్రియేషన్స్ వారు సంయుక్తంగా నిర్మాణం బాధ్యతలు చేపట్టారు.

Related Posts

Comments

spot_img

Recent Stories