యూనివర్సల్ హీరో కమల్ హాసన్ హీరోగా, త్రిష, అభిరామి ప్రధాన పాత్రల్లో నటిస్తున్న పాన్ ఇండియా మూవీ “థగ్ లైఫ్” పై భారీ అంచనాలు ఉన్నాయి. మణిరత్నం డైరెక్షన్ లో వస్తున్న ఈ సినిమా రిలీజ్ కి సమీపిస్తున్న సమయంలో అనుకోని వివాదాలు తెరపైకి వచ్చాయి.
కమల్ హాసన్ ఇటీవల ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో తమిళ్ భాష కన్నడ నుంచి ఉద్భవించిందని చెప్పడం పెద్ద దుమారం రేపింది. ఈ వ్యాఖ్యపై సోషల్ మీడియాలో విస్తృతంగా స్పందనలు వచ్చాయి. కమల్ వ్యాఖ్యలు కన్నడ ప్రజలను అసహ్యానికి గురిచేశాయని చెబుతూ విమర్శలు వెల్లువెత్తాయి.
దీనికి స్పందనగా కమల్ హాసన్ తాను చెప్పినది తప్పుకాదని, క్షమాపణ చెప్పే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. తప్పు చేస్తే తప్పకుండా ఒప్పుకుంటానని కానీ ఇలా బలవంతంగా క్షమాపణ అడగడం సరైనది కాదని చెప్పడంతో ఈ వివాదం మరింత వేడెక్కింది.
ఇంతలో కన్నడ స్టార్ హీరో శివ రాజ్ కుమార్ ఈ సినిమా ప్రమోషనల్ ఈవెంట్ కి హాజరై, కమల్ హాసన్ తనకు తండ్రి వంటి వ్యక్తి అని చెప్పిన మాటలు మరో చర్చకు దారి తీశాయి. అయితే శివ రాజ్ కుమార్, కన్నడ ప్రేక్షకులు నాన్ కన్నడ సినిమాలను చూస్తున్నారంటూ చెప్పిన విధానం కొంతమంది కి అవమానంగా అనిపించింది. దీనిపై కూడా సోషల్ మీడియాలో విమర్శలు మొదలయ్యాయి.
ఇప్పుడు ఈ వివాదాలు మూవీ రిలీజ్ వరకు ఎటు దారితీస్తాయో చూడాలి. ఈ వివాదాల వల్ల సినిమా పై ఉన్న క్రేజ్ పెరుగుతుందా లేదా అనేది సినీ వర్గాల్లో ఆసక్తికరంగా మారింది.