సెన్సార్‌ పనులు ముగించుకున్న కమల్‌ సినిమా!

యూనివర్సల్ స్టార్ కమల్ హాసన్ నటిస్తున్న తాజా సినిమా ‘థగ్ లైఫ్’ ఇప్పటికే ప్రేక్షకులలో ఆసక్తి రేపుతోంది. ఈ చిత్రానికి మణిరత్నం దర్శకత్వం వహిస్తుండటంతో, సినిమా మీద అంచనాలు మరింత పెరిగాయి. పూర్తి స్థాయి యాక్షన్ డ్రమాగా తెరకెక్కుతున్న ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. తాజాగా ఈ సినిమా సెన్సార్ ప్రక్రియ పూర్తయింది.

సెన్సార్ బోర్డు ఈ సినిమాకు యూ/ఏ సర్టిఫికెట్ మంజూరు చేసింది. రన్‌టైమ్ విషయంలో చూస్తే, ఇది సుమారు 2 గంటల 45 నిమిషాలుగా ఫిక్స్ చేసినట్టు సమాచారం. సినిమా విడుదల సమయం దగ్గరపడుతున్న నేపథ్యంలో, ప్రేక్షకుల్లో ఈ మూవీపై క్యూరియాసిటీ ఇంకా పెరుగుతోంది. కొంతకాలం క్రితం విడుదలైన ట్రైలర్‌కు మంచి రెస్పాన్స్ వచ్చిందని చిత్రబృందం చెబుతోంది.

కమల్ హాసన్‌కి తోడు శింబు, త్రిష, అశోక్ సెల్వన్, జోజు జార్జ్ లాంటి నటులు ఈ సినిమాలో కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఇక సంగీతం విషయానికి వస్తే, ఏఆర్ రెహమాన్ స్వరాలు అందించడమే ఈ చిత్రానికి మరో ప్లస్ పాయింట్‌గా మారింది. అన్ని కార్యక్రమాలు పూర్తిచేసుకున్న థగ్ లైఫ్ సినిమాను జూన్ 5న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయడానికి సిద్ధంగా ఉంచారు.

Related Posts

Comments

spot_img

Recent Stories