క్లాసికల్ దర్శకుడు మణిరత్నం డైరెక్షన్‌లో ‘థగ్ లైఫ్’ షూటింగ్ పూర్తి అయింది. దీంతో కమల్ హాసన్ మరో చిత్రంపై ఫుల్ ఫోకస్ పెట్టారు. అన్బు-అరీవు దర్శకత్వంలో ‘కమల్ హాసన్ 237’ సినిమా చేయబోతున్నారు. ప్రస్తుతం ఈ సినిమా ప్రీప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఇప్పుడున్న అప్ డేట్ ప్రకారం జులై లేదా ఆగస్టులో ఈ సినిమా సెట్స్ పైకి వెళ్తుందని తెలుస్తోంది.
అన్నట్టు యాక్షన్ అడ్వెంచర్ డ్రామాగా తెరకెక్కనున్న ఈ చిత్రం కోసం కమల్ తన బాడీ లుక్‌ను మార్చుకునే పనిలో ఉన్నట్లు తెలుస్తోంది. కాగా పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన “కల్కి 2898 ఏడీ” బ్లాక్ బస్టర్ హిట్ ను సాధించింది. దీనికి కొనసాగింపుగా ‘కల్కి 2’ రానున్న విషయం తెలిసిందే. ‘కల్కి 2’ షూట్ కోసం కూడా కమల్ హాసన్ జూన్ నుంచి డేట్స్ ఇస్తాడని, మొదటి షెడ్యూల్ లో కమల్ హాసన్ పై కీలక సన్నివేశాలను షూట్ చేస్తారని తెలుస్తోంది.