యూనివర్సల్ హీరో కమల్ హాసన్ నటిస్తున్న తాజా చిత్రం థగ్ లైఫ్ పై ప్రేక్షకుల్లో భారీగా ఆసక్తి నెలకొంది. మణిరత్నం డైరెక్షన్ లో వస్తున్న ఈ సినిమా ప్రమోషన్స్ ఇప్పుడు జోరుగా జరుగుతున్నాయి. ఈ మధ్య జరిగిన ఒక ఈవెంట్ లో కమల్ హాసన్ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో చర్చకు దారితీశాయి.
ఆ ఈవెంట్ కి ముఖ్య అతిథిగా కన్నడ స్టార్ శివరాజ్ కుమార్ హాజరయ్యారు. ఈ సందర్భంలో కమల్ హాసన్ మాట్లాడుతూ కన్నడ భాష కూడా తమిళ్ నుంచి వచ్చింది అని చెప్పడం పెద్ద వివాదానికి తెరలేపింది. అంతే కాదు, శివరాజ్ కుమార్ కుటుంబం కూడా తనకే భాగమని, భాషల వలన ఉన్న దగ్గరతే అందుకు కారణమని కమల్ చెప్పినట్టు తెలుస్తోంది.
కానీ ఈ మాటలు కన్నడ అభిమానులకు గుచ్చుకుంది. కర్ణాటక ప్రజలకు భాషపై గల గౌరవం, ఆత్మీయత చాలా ఎక్కువ. సోషల్ మీడియాలో ఇప్పుడు దీనిపై రకరకాలుగా స్పందనలు వెల్లువెత్తుతున్నాయి.
కమల్ వ్యాఖ్యలు సినిమా మీద ఎలాంటి ప్రభావం చూపిస్తాయో చూడాలి. అలాగే ఈ వివాదం తగ్గించడానికి కమల్ హాసన్ నుంచి ఎలాంటి వివరణ వచ్చే అవకాశం ఉందా అని కూడా సినీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. మరి ఈ వివాదం థగ్ లైఫ్ రిలీజ్ కు ముందే తేలిపోతుందో లేదో వేచి చూడాలి.!