హీరో నందమూరి కళ్యాణ్ రామ్ #NKR 21 సినిమా క్లైమాక్స్ షూటింగ్ తాజాగా పూర్తయినట్టు టీం వెల్లడించింది. ప్రదీప్ చిలుకూరి డైరెక్షన్ వహిస్తున్న సినిమాలోని ఈ క్రుషియల్ పార్ట్ హైదరాబాద్ శివార్లలో ప్రత్యేకంగా వేసిన సెట్లో సుమారు నెలరోజుల పాటు చిత్రీకరించారు. ఈ కీలక సన్నివేశానికి అవసరమైన డ్రమెటిక్, లీనమయ్యే వాతావరణాన్ని క్రియేట్ చేయడానికి మేకర్స్ భారీగా నే ఖర్చు పెట్టారు. ఒక్క క్లైమాక్స్‌కే రూ. ఈ సినిమా కోసం ఇప్పటి వరకు 8 కోట్లు ఖర్చు పెట్టారని, కల్యాణ్ రామ్ కెరీర్ లోనే భారీ ఖర్చు క్లైమాక్స్ మూవీ ఇదే అని తెలుస్తుంది. ఈ క్రమంలో ఈ క్లైమాక్స్ గ్రాండియర్, హ్యూజ్ స్కేల్ లో ఉండబోతున్నట్లు తెలుస్తుంది.
అద్భుతమైన సెట్స్ రూపొందించడంలో పేరున్న బ్రహ్మ కడలి మ్యాసీవ్ సెట్ డిజైన్ చేశారు. యాక్షన్ సన్నివేశాలు, స్టంట్లు బ్రీత్ టేకింగ్ ఎక్స్ పీరియన్స్ ని అభిమానులకు అందించబోతున్నాయని మూవీ మేకర్స్ తెలిపారు. క్లైమాక్స్ సీక్వెన్స్‌లో ప్రముఖ తారాగణం మాత్రమే కాకుండా దాదాపు 1000 మంది ఆర్టిస్టులు షూటింగ్లో పాల్గొనబోతున్నారని సమాచారం. ఈ ఎపిసోడ్ ఫైనాన్సియల్, క్రియేటివ్ సోర్స్ లో గ్రేట్ ఇన్వెస్ట్ మెంట్ సూచిస్తోంది.
సినిమా నెరేటివ్ లో ఈ పార్ట్ హైలైట్ గా ఉండబోతున్నట్లు సమాచారం. హై-ఆక్టేన్ యాక్షన్‌తో కూడిన ఈ సినిమాలో విజయశాంతి IPS ఆఫీసర్‌గా కమాండింగ్ క్యారెక్టర్ లో తన డైనమిక్ ప్రెజెన్స్ తో ఆకట్టుకోబోతున్నారు. సోహైల్ ఖాన్, సాయి మంజ్రేకర్, శ్రీకాంత్ ముఖ్యమైన పాత్రలలో ఈ సినిమాలో నటించబోతున్నారు.