కల్కి ట్రైలర్‌ విడుదల ఎప్పుడంటే!

పాన్‌ ఇండియా నటుడు ప్రభాస్‌ నటిస్తున్న మోస్ట్ అవైటెడ్‌ సినిమా కల్కి 2898 ఏడీ . ఈ సినిమాని మహానటి ఫేమ్‌ నాగ్‌ అశ్విన్‌ తెరకెక్కిస్తున్నారు.  ఈ సినిమాలో ప్రభాస్ సరసన బాలీవుడ్‌ నటి దీపికా పదుకోన్, దిశా పటాని హీరోయిన్స్ గా చేస్తున్నారు. ఈ సినిమాను జూన్ 27 న గ్రాండ్ గా రిలీజ్ చేయనున్నారు.దీనితో మేకర్స్ ప్రమోషన్స్ మొదలు పెట్టారు.

ప్రమోషన్స్ లో భాగంగా ఈ చిత్రం నుండి స్పెషల్ క్యారెక్టర్ అయిన బుజ్జిని మేకర్స్ ప్రేక్షకులకు పరిచయం చేశారు.హైదరాబాద్ లోని రామోజీ ఫీల్ సిటీ లో భారీ ఈవెంట్ ను ఏర్పాటు చేసి బుజ్జి టీజర్ ను మేకర్స్ విడుదల చేసారు. ఈ సినిమాలో బుజ్జి పేరు చిన్నగా వున్నా కూడా దాని పాత్ర చాలా ప్రత్యేకం అని దర్శకుడు నాగ్ అశ్విన్ తెలిపారు. ఇదిలా ఉంటే ప్రస్తుతం బుజ్జి కార్ తో మేకర్స్ డిఫరెంట్ గా ప్రమోషన్స్ నిర్వహిస్తున్నారు.

ఇదిలా ఉంటే ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ పై ఓ న్యూస్ బాగా వైరల్ అవుతుంది. జూన్ మొదటి వారంలోనే ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ చేసేందుకు చిత్ర బృందం ప్లాన్ చేస్తున్నట్లు సినీ వర్గాలు తెలిపాయి.

Related Posts

Comments

spot_img

Recent Stories