ముంబై పోలీసుల చేతిలో కల్కి బుజ్జి!

యంగ్ రెబల్‌ స్టార్‌ ప్రభాస్‌ తాజాగా నటిస్తున్న మోస్ట్‌ అవైటైడ్‌ చిత్రాల్లో కల్కి 2898 ఏడీ కూడా ఒకటి. ఈ సినిమాని నాగ్‌ అశ్విన్‌ తెరకెక్కిస్తుండగా…ప్రభాస్‌ భైరవ అనే పాత్రలో చేస్తున్నాడు. బాలీవుడ్‌ ముద్దుగుమ్మలు దీపికా పదుకోన్ ,దిశా పటాని హీరోయిన్స్ గా నటించారు. అంతేకాకుండా బాలీవుడ్ స్టార్ అమితాబ్ బచ్చన్ ,లోక నాయకుడు కమల్ హాసన్ వంటి దిగ్గజ నటులు ఈ సినిమాలో ముఖ్య పాత్ర పోషిస్తున్నారు.

ఈ సినిమాను మేకర్స్ జూన్ 27 న గ్రాండ్ గా విడుదల చేయబోతున్నారు.ఈ సినిమా రిలీజ్ డేట్ దగ్గరపడుతుండటంతో మేకర్స్ ప్రమోషన్స్ లో స్పీడ్ పెంచారు.ఈ సినిమాలో స్పెషల్ క్యారెక్టర్ అయిన బుజ్జిని మేకర్స్ ఓ భారీ ఈవెంట్ ద్వారా ప్రేక్షకులకు పరిచయం చేసిన విషయం తెలిసిందే.

బుజ్జి అంటే ఎవరో కాదు అది ఒక రోబోటిక్ కార్ ..ఈ కారు పాత్ర సినిమాలో చాలా  ప్రత్యేకంగా ఉంటుందని మేకర్స్ తెలిపారు. బుజ్జికి స్టార్ హీరోయిన్ కీర్తి సురేష్ డబ్బింగ్ చెప్పింది.ఇదిలా ఉంటే ఈ చిత్రం ప్రమోషన్స్ లో భాగంగా దేశంలోని ప్రధాన నగరాలలో బుజ్జిని తిప్పుతూ మేకర్స్ ప్రమోషన్స్ చేస్తున్న విషయం తెలిసిందే.  బుజ్జి కార్ మొదటగా హైదరాబాద్ ఆ త‌రువాత చెన్నైలో సంద‌డి చేయ‌గా తాజాగా ముంబైలోని జుహు బీచ్‌లో సందడి చేసింది. ఈ కారును చూసేందుకు ఫ్యాన్స్ పోటీప‌డ్డారు. అలాగే ఈ కారును ఇప్ప‌టికే ప‌లువురు డ్రైవ్ చేయ‌గా తాజాగా ముంబై పోలీసులు కూడా దీన్ని డ్రైవ్ చేసి చూపించారు.  దీంతో ప్రస్తుతం దీనికి సంబందించిన వీడియో బాగా వైరల్ అవుతుంది.

Related Posts

Comments

spot_img

Recent Stories