కళింగ అందర్నీ ఆకట్టుకుంటుంది: ధృవ!

టాలీవుడ్ లో కిరోసిన సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్న ధృవ వాయు తాజాగా కళింగ అనే కొత్త కాన్సెప్ట్‌ తో అటు హీరోగా..ఇటు దర్శకుడిగా తన అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు రెడీ అవుతున్నాడు. బిగ్ హిట్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై దీప్తి కొండవీటి, పృథ్వీ యాదవ్ నిర్మిస్తున్న ఈ సినిమాపై ఇప్పటికే మంచి అంచనాలు ఏర్పడ్డాయి. టీజర్, పోస్టర్‌లు, గ్లింప్స్, సాంగ్స్ అన్నీ కూడా అందరినీ ఆకట్టుకున్నాయి.

తాజాగా ఈ సినిమాని సెప్టెంబర్ 13న విడుదల చేయబోతున్నట్లు చిత్ర బృందం ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా హీరో, దర్శకుడు ధృవ వాయు మాట్లాడుతూ.. ‘టీజర్, పోస్టర్‌లతోనే ‘కళింగ’పై భారీ అంచనాలు పెరిగిపోయాయి. ఆల్రెడీ అన్ని చోట్లా బిజినెస్ అయింది. ఇది కచ్చితంగా రెగ్యులర్ మూవీలా మాత్రం ఉండదు. అన్ని రకాల అంశాలు ఇందులో ఉంటాయి. ఎమోషన్స్, లవ్, కామెడీ, హారర్, థ్రిల్లర్ ఇలా ఏదీ కూడా కావాలని పెట్టలేదు. స్క్రిప్ట్‌లో, కంటెంట్‌లో భాగంగా అన్నీ ఆటోమేటిక్‌గా వచ్చేశాయి. నేను ఎక్కువగా మాట్లాడే బదులు.. సినిమా మాట్లాడాలి. కంటెంట్, స్క్రీన్ ప్లే చాలా టైట్‌గా ఉంటుంది. కచ్చితంగా ఈ సినిమాను థియేటర్లో చూసి ఆదరించండి. మా సినిమా సెప్టెంబర్ 13న రాబోతోంది’ అని చెప్పుకొచ్చారు.

నిర్మాత దీప్తి కొండవీటి మాట్లాడుతూ.. ‘సెప్టెంబర్ 13న మా సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. సినిమాను చూసిన తరువాత ఓ మంచి ఫీలింగ్‌తో థియేటర్లల నుంచి బయటకు వెళ్తారు. కళింగ అనేది ధృవ వాయు ఐడియానే. మేం కేవలం ఆయనకు సపోర్ట్ చేశామంతే’ అని తెలిపారు. హీరోయిన్ ప్రజ్ఞా నయన్ మాట్లాడుతూ.. ‘కళింగలో అన్ని రకాల అంశాలు ఉన్నాయి. లవ్, రొమాన్స్, హారర్, థ్రిల్లర్, కామెడీ ఇలా ఎన్నో రకాల అంశాలుంటాయి. ధృవ వాయు ఈ సినిమాను అద్భుతంగా తీశాడు. సెప్టెంబర్ 13న మా చిత్రం రాబోతోంది. అందరూ చూడండి’ అని ఆమె కోరారు.

Related Posts

Comments

spot_img

Recent Stories