పార్వతీ దేవిగా కాజల్‌!

పార్వతీ దేవిగా కాజల్‌! మంచు విష్ణు హీరోగా నటిస్తున్న తాజా భారీ పాన్ ఇండియా సినిమా “కన్నప్ప”. ఈ చిత్రం కోసం విష్ణు చాలా కష్టపడుతున్నాడు. పైగా ఈ సినిమాలో ప్రభాస్, అక్షయ్ కుమార్, మోహన్ లాల్ లాంటి ఎంతోమంది అగ్ర నటీనటులు కనిపించనున్నారనే విషయాన్ని చిత్ర బృందం ఎప్పుడో ప్రకటించింది. 

తాజాగా ఇందులో కాజల్ పాత్ర ఫస్ట్‌లుక్‌ను మూవీ మేకర్స్‌ ప్రేక్షకుల ముందుకు తీసుకుని వచ్చారు.కాజల్‌ పార్వతీదేవిగా కనిపించనున్నట్లు చిత్రబృందం అధికారికంగా ప్రకటించి అందర్ని ఆశ్చర్యపరిచింది. ఈ చిత్రంలో శివుడిగా బాలీవుడ్‌ స్టార్‌ హీరో అక్షయ్‌కుమార్‌ నటిస్తున్నారు. కాగా ఏప్రిల్ 25, 2025న ఈ సినిమా విడుదల అవ్వబోతుంది. ప్రీతి ముకుందన్ ఈ సినిమాలో కథానాయికగా నటిస్తోంది. 

ఈ ఫాంటసీ యాక్షన్ డ్రామాకి మహా భారత్ సీరియల్‌ని డైరెక్ట్ చేసిన ముఖేష్ కుమార్ సింగ్ డైరెక్షన్‌ చేస్తున్నారు. 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ, ఏవీఏ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్లపై మోహన్ బాబు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

Related Posts

Comments

spot_img

Recent Stories