బ్రేక్‌ ఈవెన్‌ ఇచ్చిన కె-ర్యాంప్‌!

దీపావళి సందర్భంలో థియేటర్లలో రిలీజ్ అయిన సినిమాల మధ్య కిరణ్ అబ్బవరం నటించిన ‘కె-ర్యాంప్’ కూడా మంచి హడావుడి చేస్తోంది. ఈ చిత్రాన్ని జెయిన్స్ నాని మాస్ అండ్ కమర్షియల్ ఎలిమెంట్స్‌తో తెరకెక్కించగా, ప్రేక్షకులు థియేటర్లలో బాగానే ఎంజాయ్ చేస్తున్నారు. మొదటి రోజు మిక్స్డ్ టాక్ వచ్చినా, సెలవుల సీజన్ కలిసొచ్చి సినిమా కలెక్షన్స్‌పై మంచి ప్రభావం చూపించింది.

మూడురోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా దాదాపు రూ.17.5 కోట్ల గ్రాస్ వసూలు సాధించిందని ట్రేడ్ సర్కిల్స్ చెబుతున్నాయి. దీని వల్ల సినిమా బ్రేక్ ఈవెన్ దశను చేరుకున్నట్లు మేకర్స్ ఆనందంగా వెల్లడించారు. ముఖ్యంగా కిరణ్ అబ్బవరం యాక్షన్, డైలాగ్ డెలివరీ మాస్ ఆడియన్స్‌కి బాగా నచ్చడంతో థియేటర్లలో విజిల్స్, కేకలతో వాతావరణం రగిలిపోతోంది.

యుక్తి తరేజా హీరోయిన్‌గా నటించిన ఈ చిత్రానికి చైతన్ భరద్వాజ్ సంగీతం అందించగా, హాస్య మూవీస్ బ్యానర్‌పై రాజేష్ దండా, శివ బొమ్మక్ కలిసి ఈ సినిమాను నిర్మించారు.

Related Posts

Comments

spot_img

Recent Stories