స్టార్‌ హీరో చేతిలోకి ‘క’ సినిమా!

కిరణ్ అబ్బవరం నటిస్తున్న కొత్త సినిమా ‘క’. ఇటు తెలుగుతో పాటు అటు తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో కూడా ఈ సినిమా విడుదల కానున్నట్లు సమాచారం. మాలీవుడ్ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ మలయాళంలో ‘క’ను ప్రేక్షకుల ముందుకు తీసుకుని రాబోతున్నాడు. దుల్కర్ సల్మాన్ నటుడు మాత్రమే కాదు.. నిర్మాత కూడా. Wayfarer Films పేరుతో దుల్కర్ కు సొంత ప్రొడక్షన్ హౌస్ కూడా ఉంది.

ఈ నేపథ్యంలోనే ‘క’ చిత్రాన్ని మలయాళంలో విడుదల చేసేందుకు దుల్కర్ సల్మాన్ రెడీగా ఉన్నాడు. కాగా ‘క’ సినిమాలో కిరణ్ అబ్బవరం సరసన నయన్ సారిక, తన్వీ రామ్ హీరోయిన్స్ గా చేస్తున్నారు.ఈ సినిమాని చింతా వరలక్ష్మి సమర్పణలో శ్రీ చక్రాస్ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకం మీద చింతా గోపాలకృష్ణ రెడ్డి ఎంతో గ్రాండ్‌ గా నిర్మిస్తున్నారు. గ్రామీణ నేపథ్యంలో సాగే ఈ సినిమా పీరియాడిక్‌ యాక్షన్ థ్రిల్లర్‌గా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. దర్శక ద్వయం సుజీత్, సందీప్ ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నారు

Related Posts

Comments

spot_img

Recent Stories