కేవలం నా ఫొటోలే..!

బాలీవుడ్ హీరోయిన్ కరీనా కపూర్ ‌తన పిల్లల వ్యక్తిగత గోప్యత విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటారనే విషయం తెలిసిందే. ముఖ్యంగా తన పిల్లల ఫోటోలు తీయొద్దని తరుచూ ఫొటోగ్రాఫర్లకు ఆమె విజ్ఞప్తి చేస్తూ ఉంటుంది. ఐతే, తాజాగా రణ్‌ధీర్‌ కపూర్‌ పుట్టినరోజు వేడుకలకు పిల్లలతో కలిసి కరీనా హాజరు అయింది. ఐతే, ఈ ఈవెంట్‌లోకి ఆమె అడుగుపెడుతోన్న సమయంలో పలువురు ఫొటోలు తీస్తూ ఉండగా.. కరీనా కపూర్ సీరియస్ అయ్యారు.

ఈ సందర్భంగా కరీనా కపూర్ మాట్లాడుతూ.. ‘కేవలం నా ఫొటోలు మాత్రమే తీసుకోండి. దయచేసి పిల్లల ఫొటోలను తీసుకోవద్దు. ఇప్పటికే ఈ విషయం గురించి మీ అందరితో చాలాసార్లు చెప్పాను’’ అని కరీనా పేర్కొన్నారు. ఇక సైఫ్ అలీఖాన్‌పై దాడి అనంతరం ఆయన సతీమణి కరీనా ను తప్పుపడుతూ అనేక వార్తలు వైరల్ అయిన సంగతి తెలిసిందే.

 ఈ వార్తల పై బాలీవుడ్‌ స్టార్ అక్షయ్‌ కుమార్‌ సతీమణి ట్వింకిల్‌ ఖన్నా కూడా మీడియా ముందు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆ తర్వాత, కరీనా ‘సందర్భం వచ్చినపుడు జీవితం మన మెడలు వంచి పాఠాలు నేర్పుతుంది’’ అని కరీనా కపూర్‌ తెలిపింది.

Related Posts

Comments

spot_img

Recent Stories