‘జిందాల్ కోసమే’.. అనుమానాలు ఎవరిపైనంటే?

ముంబాయి హీరోయిన్ కాదంబరి జత్వానీ కేసు విషయంలో అసలు కీలకవిషయాలు ఆమె వాంగ్మూలంతోనే బయటకు వస్తున్నాయి. వైసీపీ నాయకుడు కుక్కల విద్యాసాగర్ పెట్టిన కేసు కేవలం ఆమెను నిర్బంధంలోకి తీసుకుని బెదిరించడానికి ఒక మిష మాత్రమే అని తొలినుంచి ఉన్న అనుమానాలు నిజమేనని తేలుతున్నాయి. తనను పోలీసులు నిర్బంధించిన తర్వాత.. ముంబాయిలో సజ్జన్ జిందాల్ మీద పెట్టిన అత్యాచారం కేసులను వెనక్కు తీసుకునేలా తీవ్రమైన ఒత్తిడి చేసేందుకు, తన ఐఫోన్, ఐప్యాడ్ లలో ఉన్న ఆధారాలను ధ్వంసం చేసేందుకు పోలీసులు తీవ్రంగా ప్రయత్నించారని కాదంబరి జత్వానీ పోలీసులకు ఇచ్చిన వాంగ్మూలంలో పేర్కొనడం ఇప్పుడు సర్వత్రా సంచలనాశంగా మారుతోంది.

తన మీద కేసు పెట్టి అరెస్టు చేయించిన కుక్కల విద్యాసాగర్ తోపాటు, ఐపీఎస్అధికారులు పీఎస్ఆర్ ఆంజనేయులు, కాంతిరాణా తాతా, విశాల్ గున్నీలపై కలిపి కాదంబరి ఇబ్రహీంపట్నం స్టేషన్లో కేసులు పెట్టిన సంగతి తెలిసింది. ఈ వాంగ్మూలంలో ఆమె అనేక సంగతులు చెప్పారు. సజ్జన్ జిందాల్ పై ముంబయిలో పెట్టిన అత్యాచారం కేసు ఉపసంహరించుకుంటావా లేదా? లేకపోతే నీమీద మరిన్ని కేసులు బనాయిస్తాం అంటూ బెదిరించినట్లు అఆమె చెప్పారు. తనను జైల్లో పెట్టి.. కేసు ఉపసంహరణ కోసం ఒక న్యాయవాదిని కూడా తన వద్దకు పంపినట్లుగా ఆమె చెప్పారు. తన ఐఫోన్ పాస్ వర్డ్ లు చెప్పించుకుని, అందులోని ఆధారాలు ధ్వంసం చేయాలని చూశారని కానీ తాను చెప్పలేదని అన్నారు. కాంతిరాణా స్వయంగా తనను నిర్బంధించిన పోలీసులతో మాట్లాడుతూ ఫాలో అప్ చేసినట్టుగా కూడా వెల్లడించారు. పోలీసులే తమ వెంట ఫోర్జరీ డాక్యుమెంట్లు తీసుకువచ్చి, అవి కాదంబరి ఇంట్లో దొరికినట్టుగా రికార్డులో చూపించారని కూడా ఆమె అన్నారు.

మొత్తానికి సజ్జన్ జిందాల్ కోసమే ఐపీఎస్ త్రయం ఆధ్వర్యంలో అప్పటి పోలీసులు కాదంబరిని వేధించారనే సంగతి ఇప్పుడు తేలుతోంది. అయితే సజ్జన్ జిందాల్ కోసం పోలీసులను ఈ స్థాయిలో పరుగులు పెట్టించింది.. వారితో పనులు చేయించింది ఎవరు? అనేది తేలాలి? ఈ విషయంలో అందరి అనుమానాలు జగన్ వైపే వెళుతున్నాయి. ఒకవేళ సజ్జల రామక్రిష్ణారెడ్డి పోలీసుల్ని పురమాయించి పనిచేయించి ఉన్నాసరే.. జగన్ కోసమే అని అంతా అనుకుంటున్నారు.

జగన్, సజ్జన్ జిందాల్ స్నేహితులు. జిందాల్ తో దోస్తానా కోసమే జగన్ ఇదంతా చేశారని ఆయన చెల్లెలు షర్మిల కూడా ఆరోపించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు కేసు జరుగుతున్న క్రమాన్ని బట్టి.. సజ్జన్ జిందాల్ ను కూడా పోలీసులు విచారించే అవకాశం ఉంది. ఆయన నుంచి కూడా కొన్ని వివరాలు రాబడతారు. ముగ్గురు ఐపీఎస్ ల వాంగ్మూలాలు కూడా తీసుకున్న తరువాత.. ప్రభుత్వంలోని పెద్దలు తెరవెనుక కథ నడిపించింది ఎవ్వరు? అనేది బయటకు వస్తుంది.

Related Posts

Comments

spot_img

Recent Stories