నందమూరి నటసింహం బాలకృష్ణకు కేంద్రం పద్మ భూషణ్‌ను ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ ఆయనకు శుభాకాంక్షలు తెలియజేశారు. బాలా బాబాయ్ కంగ్రాట్స్ అంటూ తమ ఆనందాన్ని ట్వీట్ల రూపంలో తెలియజేశారు. నువ్వు సినీ పరిశ్రమకు చేసిన సేవలు, చేసే సామాజిక సేవలకు నిదర్శనంగా ఈ అవార్డు వచ్చింది అంటూ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ తమ ఎక్స్ ఖాతాల్లో తెలిపారు.
వీరు వేసిన ట్వీట్లతో నందమూరి అభిమానులు ఫుల్ ఖుషీగా ఉన్నారు. బాలా బాబాయ్‌కి ఇలాంటి గొప్ప ప్రతిష్టాత్మక అవార్డు రావడం ఎంతో ఆనందంగా ఉందని కళ్యాణ్ రామ్, ఎన్టీఆర్ తమ తమ ట్వీట్లలో రాసుకొచ్చారు. ఇక బాలయ్యకు వచ్చిన ఈ పురస్కారం పట్ల టాలీవుడ్ ప్రముఖులు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు.