పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి మన తెలుగు రాష్ట్రాల్లో ఉన్న క్రేజ్ గురించి కొత్తగా చెప్పాల్సిన అవసరమే లేదు. ఆయన సినిమాలు మాత్రమే కాదు, స్టైల్ కూడా అప్పటి నుంచి ఇప్పటి వరకూ యూత్‌కి స్ఫూర్తి లాంటిదే. ఖుషి, జానీ, బాలు వంటి సినిమాల్లో వేసుకున్న కార్గో జీన్స్, హుడీలు, వేర్వేరు డ్రెస్సింగ్ స్టైల్స్ అన్నీ అప్పట్లో ట్రెండ్ సెట్ చేశాయి.
తర్వాత అత్తారింటికి దారేది సమయంలో కూడా అలాంటి ఫ్యాషన్ ఇంపాక్ట్ కనిపించింది. ఇప్పుడు మళ్లీ ఓజి సినిమా వలన ఆ రోజులు గుర్తు వస్తున్నాయి. ఈ సినిమా కోసం ప్రత్యేకంగా మెర్చండైజ్ విడుదల చేయగా అభిమానులు ఊహించని రీతిలో స్పందించారు. చాలా తక్కువ సమయంలోనే మొత్తం స్టాక్ అయిపోవడం చూసి అందరూ ఆశ్చర్యపోయారు.