జాన్వీ నే కాదు మరో ముద్దుగుమ్మ కూడా!

యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌ కథానాయకునిగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం దేవర. ఈ సినిమాని అక్టోబర్‌ 10న ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేసేందుకు చిత్రం బృందం రెడీగా ఉంది. ఈ సినిమాలో ఇప్పటికే బాలీవుడ్ భామ జాన్వీ కపూర్‌ ఈ సినిమాలో హీరోయిన్‌ గా నటిస్తున్న సంగతి తెలిసిందే.

ఈ సినిమాలో ఓ స్పెషల్‌ సాంగ్‌ ఉన్నట్లు ఇప్పటికే చిత్ర బృందం ప్రకటించిన విషయం తెలిసిందే.అయితే తాజాగా ఈ సినిమా కోసం మరో బాలీవుడ్‌ స్టార్‌ హీరోయిన్‌ కూడా తీసుకుంటున్నట్లు చిత్ర బృందం ప్రకటించింది. అయితే ఆ హీరోయిన్ ఎవరు అనే దానిని మాత్రం మూవీ మేకర్స్ వెల్లడించలదేఉ.

దీంతో మరో బాలీవుడ్ భామను తీసుకుంటే ఈ చిత్రంలో బాలీవుడ్ తారాగణం ఎక్కువే ఉంటారు. ఎందుకంటే ఇప్పటికే ఈ చిత్రంలో విలన్‌ గా బాలీవుడ్‌ నటుడు సైఫ్‌ అలీఖాన్‌, జాన్వీ కపూర్‌, ఇప్పుడు మరో కొత్త నటిని తీసుకుంటే ఆమె. ఈ సినిమాలో సైఫ్‌ – తారక్‌ మధ్య వచ్చే సన్నివేశాలు చాలా అద్బుతంగా వచ్చాయని వార్తలు వినిపిస్తున్నాయి.

ఈ సినిమా కోసం తారక్‌ కూడా చాలా డిఫరెంట్‌ గా కనిపించబోతున్నాడు. మొత్తానికి సినిమా ప మాత్రం రోజురోజుకి అంచనాలు పెరుగుతున్నాయి.

Related Posts

Comments

spot_img

Recent Stories