జవహర్ : బిడ్డ చచ్చినా పురిటి వాసన పోదేమో!!

మొన్న మొన్నటిదాకా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా ఉన్నటువంటి జవహర్ రెడ్డి విపరీతమైన అవినీతి ఆరోపణలను మూటగట్టుకున్నారు.  ఐఏఎస్ అధికారిగా తన సుదీర్ఘమైన ప్రస్థానంలో తొలినాళ్లలో నిష్కళంకుడిగా, నిజాయితీగల అధికారిగా పేరు తెచ్చుకున్న జవహర్ రెడ్డిని చివరి రోజుల్లో అనేక ఆరోపణలు చుట్టుముట్టా.యి కేవలం జగన్మోహన్ రెడ్డి సారధ్యంలోని ప్రభుత్వంలో ప్రధాన కార్యదర్శిగా ఉండడం- జగన్మోహన్ రెడ్డికి వీరవిధేయుడిగా, వీరభక్తుడిగా ఉండడం ఆయనకు శాపమైంది. జగన్ నిర్ణయాలన్నింటికీ తల ఊపి పనిచేసుకుంటూ పోవడమే జవహర్ రెడ్డి పాలిట శాపంగా పరిణమించింది. జూన్ నెలాఖరుకు ఆయన పదవీ విరమణ చేయబోతుండగా అంతకంటే ముందే ఆయన ప్రధాన కార్యదర్శి పదవి నుంచి బదిలీచేయాల్సి వచ్చింది. ఆయనను సెలవు పై పంపిన ప్రభుత్వం చీఫ్ సెక్రటరీగా మరొకరిని నియమించింది. ఈనెలాఖరుకు సివిల్స్ అధికారిగా ఆయన ప్రస్థానం పూర్తవుతుంది. కానీ ఆయన మీద చివరి అంకంలో వెల్లువెత్తిన అవినీతి ఆరోపణలు బినామీ ఆస్తుల పర్వాలు ఇవన్నీ ఆయనను అంత సులభంగా వదిలిపోయేలా లేవు.

విశాఖలో భూకబ్జాలపర్వంలో జవహర్ రెడ్డి సాగించిన బాగోతం గురించి జనసేన పార్టీ అలుపెరగని పోరాటం చేస్తోంది. మెగా ఫుడ్ పార్క్ భూములు జవహర్ రెడ్డి బినామీల పరం అయ్యాయని జనసేన నాయకుడు మూర్తి యాదవ్ ఆరోపిస్తూనే ఉన్నారు. ఆయన తన ఆరోపణలకు తగిన సాక్షాలను కూడా చూపిస్తున్నారు. వీటిని లోతుగా గమనించినప్పుడు పదవీ విరమణ చేసిన తర్వాత అయినా సరే జవహర్ రెడ్డి మీద శాఖాపరమైన విచారణ ఉంటుందని ఆయన పోలీసు దర్యాప్తును కూడా ఎదుర్కోవాల్సి ఉంటుందని పలువురు అంచనా వేస్తున్నారు.
జవహర్ రెడ్డి ఒకప్పట్లో ఎంత మంచి అధికారిగా పేరు తెచ్చుకున్నప్పటికీ తన కెరియర్ చివరి దశలో ఇలా భ్రష్టు పట్టిపోవడం వెనుక ప్రధాన కారణం జగన్మోహన్ రెడ్డి మాత్రమే అని పలువురు అధికారులు వ్యాఖ్యానిస్తున్నారు. సీనియర్ అధికారులలో రాజకీయ నాయకుల పట్ల ఎంతటి భక్తి, ఎంతటి ప్రేమ అయినా ఉండవచ్చు కానీ వాటిని ప్రదర్శించడంలో అదుపుతప్పి వ్యవహరించకూడదనేది పలువురి మాటగా ఉంటోంది. జవహర్ రెడ్డి జీవితానుభవాల నుంచి సివిల్స్ అధికారులు అందరూ కూడా పాఠాలు నేర్చుకోవాలని పలువురు సూచిస్తున్నారు.

Related Posts

Comments

spot_img

Recent Stories