ఓటీటీలోకి జాట్‌!

బాలీవుడ్ మాస్ హీరో సన్నీ డియోల్ ప్రధాన పాత్రలో నటించిన యాక్షన్ డ్రామా ‘జాట్’ గత ఏప్రిల్ 10న థియేటర్లలో విడుదలై మంచి హిట్‌గా నిలిచింది. తెలుగు దర్శకుడు గోపీచంద్ మలినేని దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, మైత్రీ మూవీ మేకర్స్ సంస్థలు కలిసి నిర్మించాయి. ఈ సినిమాకు నార్త్ ఆడియన్స్‌తో పాటు తెలుగు ప్రేక్షకుల నుంచి కూడా మంచి స్పందన లభించింది, అది దర్శకుడి తెలుగు బ్యాక్‌గ్రౌండ్ వల్లనేనేమో.

ఇప్పుడు ఈ చిత్రం ఓటీటీలో ప్రేక్షకులను ఆకట్టుకోవడానికి సిద్ధమవుతోంది. జూన్ 5వ తేదీ నుంచి ఈ సినిమా నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కానుంది. థియేటర్లలో హిందీ వెర్షన్ మాత్రమే విడుదలైనప్పటికీ, ఓటీటీకి తెలుగు డబ్ వర్షన్‌ కూడా రెడీ చేశారు. ఈసారి తెలుగు ఆడియన్స్ కోసం స్పెషల్ ట్రీట్ అని చెప్పొచ్చు.

తెలుగు వెర్షన్‌ రిలీజ్‌తో ఈ సినిమాలోని పవర్‌ఫుల్ డైలాగులు ఇప్పుడు మన భాషలో వినిపించబోతున్నాయి. థమన్ సంగీతం సినిమాకు ఓ మేజర్ హైలైట్‌గా నిలిచింది. హై వోల్టేజ్ యాక్షన్, మాస్ ఎలిమెంట్స్‌తో ఈ మూవీ తెలుగు ఓటీటీ వీక్షకులను ఎంతవరకు ఆకట్టుకుంటుందో త్వరలో తేలనుంది.

Related Posts

Comments

spot_img

Recent Stories