పెళ్లి పీటలు ఎక్కబోతున్న జాతిరత్నాలు చిట్టి!

హైదరాబాద్‌ భామా…ఫరియా అబ్దుల్లా.. జాతిరత్నాలు చిట్టి పేరుతో బాగా ఫేమస్‌ అయ్యింది. ఆ తరువాత బంగార్రాజు అనే సినిమాలో ఓ సాంగ్‌ లో చేసింది.  జాతిరత్నాలు భారీ హిట్‌ ని అందుకుని భారీ కలెక్షన్లు కూడా వసూలు చేసింది. ఆ తరువాత ఆమె చాలా సినిమాల్లో కనిపించినప్పటికీ పెద్దగా క్లిక్ కాలేకపోయింది.

దీంతో ఈ అమ్మడికి పెద్దగా అవకాశాలు రావేమో అని అంతా అనుకున్నారు. కానీ తాజాగా అల్లరి నరేష్‌ పక్కన ఆ ఒక్కటి అడక్కు అనే సినిమాలో హీరోయిన్‌ గా నటించే ఛాన్స్ కొట్టేసింది. దీంతో పాటు మరో తమిళ సినిమాలో నటించేందుకు కూడా ఈ అమ్మడు సైన్‌ చేసింది. ఇదంతా ఇలా ఉంటే.. తాజాగా ఈ పొడుగు సుందరి పెళ్లి చేసుకోబోతున్నట్లు సమాచారం.

తన చిన్ననాటి స్నేహితుడ్ని ఈ అమ్మడు పెళ్లి చేసుకునేందుకు రెడీ అయ్యింది. అతను కూడా సినిమాలంటే ఇష్టం ఉండడంతో షార్ట్‌ ఫిలింస్ లో నటిస్తున్నట్లు సమాచారం. ఇది ఎంతవరకు నిజం అనే విషయం మాత్రం తెలియదు కానీ.. సోషల్ మీడియాలో మాత్రం విపరీతంగా ప్రచారం జరుగుతుంది.

పెద్దవారు కూడా వీరి పెళ్లికి ఒప్పుకోవడంతో ఈ ఏడాదే వీరు పెళ్లి చేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి.

Related Posts

Comments

spot_img

Recent Stories