బాలీవుడ్ స్టార్ నటుడు సన్నీ డియోల్ హీరోగా టాలీవుడ్ దర్శకుడు గోపిచంద్ మలినేని కాంబినేషన్ లో చేసిన లేటెస్ట్ అవైటెడ్ చిత్రమే ‘జాట్’. మరి మాస్ ఆడియెన్స్ లో అలాగే సన్నీ అభిమానుల్లో కూడా క్రేజీ రెస్పాన్స్ ని అందుకున్న ఈ సినిమా నార్త్ బెల్ట్ లో స్టడీ వసూళ్ళతో ముందుకు దూసుకుపోతుంది. తాజాగా ఈ మూవీ శుక్రవారం కూడా సుమారు 4 కోట్ల మేర నెట్ వసూళ్లు అందుకొని రికార్డులు సృష్టించింది.
దీంతో మొత్తం 66 కోట్లకి పైగా నెట్ వసూళ్లు ఈ సినిమా ఇండియా వైడ్ అందుకున్నట్లు బాలీవుడ్ పి ఆర్ లెక్కలు వివరిస్తున్నాయి.