‘జాట్’ సాలిడ్ వీకెండ్..!

రీసెంట్ గా బాలీవుడ్ సినిమా దగ్గర రిలీజ్ కి వచ్చి మంచి హిట్ అయ్యిన చిత్రాల్లో నటుడు సన్నీ డియోల్ హీరోగా నటించిన సాలిడ్ మాస్ యాక్షన్ డ్రామా “జాట్” కూడా ఒకటి. టాలీవుడ్ యంగ్‌ డైరెక్టర్‌  గోపీచంద్ మలినేని తీర్చిదిద్దిన ఈ మూవీ స్టడీ వసూళ్లతో దూసుకుపోతుంది. ఇక ఇలా మరో వీకెండ్ లోకి రావడంతో మళ్ళీ సినిమా నార్త్ బెల్ట్ లో ఓ రేంజ్‌ లో దూసుకుపోతున్నట్లు తెలుస్తుంది.

ఆల్రెడీ బుకింగ్స్ పరంగా కూడా జాట్ ఊపందుకోగా బుక్ మై షోలో ఈ చిత్రం ఇపుడు వరకు 1 మిలియన్ కి పైగా టికెట్స్ ని అమ్ముడుపోయినట్టుగా తెలుస్తుంది. దీనితో మేకర్స్ కూడా ఈ విషయంలో ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇక ఈ వీకెండ్ కూడా సాలిడ్ గా ఉంటుందని అనుకుంటున్నారు. మరి ఈ రెండు రోజుల్లో జాట్ ఎలాంటి వసూళ్లు అందుకుంటుందో చూడాలి. మరి ఈ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్ తెరకెక్కించగా దీనికి సీక్వెల్ ని కూడా లాక్ చేశారు.

Related Posts

Comments

spot_img

Recent Stories