ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప, పుష్ప 2 సినిమాలతో సృష్టించిన హంగామా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన నటన, స్టైల్, డైలాగులు ప్రపంచవ్యాప్తంగా అభిమానులను ఆకట్టుకున్నాయి. భారతదేశంలో ఈ రెండు సినిమాలు ఏ స్థాయిలో మేనియా క్రియేట్ చేశాయో అందరికీ తెలుసు.
ఇక ఆ క్రేజ్ బాలీవుడ్‌లో కూడా ఇంకా కొనసాగుతూనే ఉంది. తాజాగా అక్కడ తెరకెక్కిన “పరమ్ సుందరి” అనే సినిమాలో హీరో సిద్ధార్థ్ మల్హోత్ర, హీరోయిన్ జాన్వీ కపూర్ జంటగా కనిపించనున్నారు. ఈ సినిమా ట్రైలర్‌ను విడుదల చేసిన మేకర్స్, అందులో ఒక ఇంట్రెస్టింగ్ సీన్ పెట్టారు. ఆ సీన్‌లో జాన్వీ కపూర్ ఆంధ్ర – తెలుగు అల్లు అర్జున్ అని చెప్పి, పుష్ప సినిమాలో కనిపించిన ఆయన స్టైల్, మేనరిజంను అచ్చం కాపీ చేసి చూపించింది.
ఈ సీన్ సోషల్ మీడియాలో వేగంగా పాపులర్ అవుతోంది. దీని ద్వారా పుష్ప సినిమాకు, అల్లు అర్జున్ స్టైల్‌కు బాలీవుడ్ ప్రేక్షకుల్లో ఇంకా ఎంత ప్రభావం ఉందో మళ్లీ రుజువైంది.