అందాల భామ జాన్వీ కపూర్ బాలీవుడ్‌లో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకుంది. ఇక ఆమె ఎన్టీఆర్ నటించిన ‘దేవర’ చిత్రంతో టాలీవుడ్‌లో అదిరిపోయే ఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమా సక్సెస్‌తో అమ్మడికి వరుసగా ఆఫర్లు వచ్చి పడుతున్నాయి. ఇప్పటికే రామ్ చరణ్ నటిస్తున్న ‘పెద్ది’ సినిమాలో జాన్వీ హీరోయిన్‌గా నటిస్తోంది.
ఇక ఇప్పుడు తమిళ్‌లోనూ జాన్వీ కపూర్ ఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధమవుతోందట. ప్రముఖ దర్శకుడు పా రంజిత్ జాన్వీ కపూర్‌తో ఓ వెబ్ సిరీస్ చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నట్లు కోలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. ఈ వెబ్ సిరీస్ సామాజిక అంశాలపై నడుస్తుందని తెలుస్తోంది. దీంతో ఈ వెబ్ సిరీస్‌లో జాన్వీ పాత్ర అల్టిమేట్‌గా ఉండబోతుందని వార్తలు వినిపిస్తున్నాయి.
మరి పా రంజిత్ చెప్పిన కథకు జాన్వీ కపూర్ గ్రీన్ సిగ్నల్ ఇస్తుందా లేదా అనేది ఆసక్తికరంగా మారింది. ఒకవేళ ఆమె ఈ వెబ్ సిరీస్‌కు ఓకే చెబితే ఎలాంటి పర్ఫార్మెన్స్‌తో ప్రేక్షకులను ఆకట్టుకుంటుందో చూడాలి.