ముగ్గురు కావాల్సిందే అంటున్న జాన్వీ!

జాన్వీ కపూర్ బాలీవుడ్‌లో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చినా, ఆమెపై సౌత్ ప్రేక్షకులకూ ప్రత్యేకమైన అనుబంధం ఉంది. కారణం ఆమె తల్లి శ్రీదేవి ఇక్కడి స్టార్ కావడం. జాన్వీ కూడా తన వ్యక్తిగత విషయాల గురించి మాట్లాడినప్పుడు తరచూ సౌత్‌కి ఉన్న బంధాన్ని గుర్తు చేసుకుంటుంది.

ఇటీవల తన కొత్త సినిమా పరమ్ సుందరి ప్రమోషన్స్ లో భాగంగా కపిల్ శర్మ షోలో పాల్గొన్న జాన్వీ, పెళ్లి మరియు పిల్లల గురించి మాట్లాడింది. ముఖ్యంగా పిల్లల విషయానికి వస్తే, ముగ్గురు పిల్లలు కావాలని ఉందని చెప్పింది. ఎందుకు అంటే మూడు తనకు లక్కీ నంబర్ అని సరదాగా చెప్పడంతో పాటు ఇద్దరు పిల్లలు ఉంటే ఎక్కువగా గొడవలు పడతారని, ముగ్గురు ఉంటే ఇంట్లో ఎప్పుడూ చలాకీ వాతావరణం ఉంటుందని నవ్వుతూ చెప్పింది. ఈ వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అవుతున్నాయి.

ఇక ముందు ఒక ఇంటర్వ్యూలో కూడా జాన్వీ తన పెళ్లి గురించి ఆసక్తికరంగా చెప్పిన విషయం బయటికి వచ్చింది. చెన్నైలోని పూర్వికుల ఇంట్లో పెళ్లి జరగాలని తన కోరిక అని చెప్పిన ఆమె, పెళ్లి తంతులు పూర్తయ్యాక తిరుమలలో వివాహం జరిగితే బాగుంటుందని, తర్వాత తిరుపతిలో సెటిల్ కావాలని అనుకుంటున్నానని వెల్లడించింది.

Related Posts

Comments

spot_img

Recent Stories