అందాల భామ జాన్వీ కపూర్ ప్రస్తుతం వరుసగా సినిమాలు చేస్తూ బిజీగా ఉంది. నార్త్‌తో పాటు సౌత్‌లోనూ అమ్మడు వరుస ఛాన్స్‌లతో దుమ్మురేపుతుంది. ఇక ఇప్పటికే సౌత్‌లో వరుసబెట్టి సినిమాలు చేస్తున్న ఈ బ్యూటీ నార్త్‌లోనూ మంచి క్రేజీ చిత్రాలను చేస్తోంది.
తాజాగా ఈ బ్యూటీ బాలీవుడ్‌లో హీరో సిద్ధార్థ్ మల్హోత్రా సరసన ‘పరమ్ సుందరి’ అనే ప్రాజెక్టులో నటిస్తోంది. ఈ సినిమాలో జాన్వీ ఓ మిడిల్ క్లాస్ అమ్మాయి పాత్రలో నటిస్తోంది. ఇక ఈ సినిమా షూటింగ్‌లో భాగంగా తాజాగా ఈ బ్యూటీ సిద్ధార్థ్ నేర్పిస్తుండగా ఓ స్కూటీని ట్రయల్ చేసింది.దీంతో ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. ఈ వీడియోతో జాన్వీ కపూర్ అభిమానులు సంఘీవాభం తెలుపుతున్నారు.