నేచురల్‌ స్టార్‌ పక్కన జాన్వీ కపూర్‌!

‘నేచురల్ స్టార్’ నాని హీరోగా, వివేక్‌ ఆత్రేయ దర్శకత్వంలో తెరకెక్కిన ‘సరిపోదా శనివారం’ సినిమా మరో మూడు రోజుల్లో  విడుదలకు సిద్దంగా ఉంది. సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా నాని ప్రస్తుతం వరుస ఇంటర్వ్యూలతో ఫుల్‌ బిజీగా ఉన్నాడు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన నాని.. తన తర్వాతి సినిమాలో బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్‌ నటించనుందన్న వార్తలపై తాజాగా స్పందించారు.

మీ తర్వాతి సినిమాలో జాన్వీ కపూర్‌ హీరోయిన్‌గా ఫిక్స్ అయిందనే విషయం.. నిజమేనా? అని అడగగా.. ‘నా తరువాత సినిమాలో జాన్వీ కపూర్‌ హీరోయిన్‌గా చేస్తుందనేది కేవలం ఓ రూమర్‌ మాత్రమే. బహుశా జాన్వీని తీసుకోవడం కోసం చర్చలు జరుగుతూ ఉండొచ్చేమో. సినిమాకు సంబంధించిన స్క్రిప్ట్‌ వర్క్‌ అయితే ప్రస్తుతం జరుగుతోంది. నేను కొన్ని రోజులుగా వరుస షూటింగ్‌లతో క్షణం తీరిక లేకుండా ఉన్నాను.

కాబట్టి నా తరువాత ప్రాజెక్ట్‌ గురించి పూర్తి వివరాలు నాకు సరిగా తెలియదు’ అని నాని సమాధానం చెప్పుకొచ్చాడు. శైలేష్ కొలను (హిట్ 3) లేదా సుజిత్ దర్శకత్వంలో నాని నటించనున్నారని సమాచారం. బాలీవుడ్‌లో స్టార్ అయిన జాన్వీ కపూర్‌.. టాలీవుడ్‌లోనూ వరుస అవకాశాలను సొంతం చేసుకుంటుంది. ఇప్పటికే జూనియర్ ఎన్టీఆర్‌ సరసన ‘దేవర’లో నటిస్తుంది.

సెప్టెంబర్‌ 27న మొదటి పార్ట్‌ విడుదల కానుంది. బుచ్చిబాబు-రామ్‌ చరణ్‌ కాంబోలో రాబోతున్న సినిమాలో కూడా జాన్వీ నటించనున్నారు. నాని సినిమాకు కూడా జాన్వీ గ్రీన్‌ సిగ్నల్ ఇస్తే.. తెలుగులో మూడో సినిమా అమ్మడి అకౌంట్లో పడినట్లే.

Related Posts

Comments

spot_img

Recent Stories