ప్రస్తుతం టాలీవుడ్ తో పాటు అన్ని భాషాల్లోనూ దుమ్ము లేపుతున్న భారీ పాన్ ఇండియా చిత్రం “పుష్ప 2” గురించి అందరికీ తెలిసిన విషయమే. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా రష్మికా హీరోయిన్ గా డైరెక్టర్ సుకుమార్ తెరకెక్కించిన ఈ సెన్సేషనల్ హిట్ చిత్రం గురించి ఇండియా మొత్తం మాట్లాడుకుంటుంది.
అయితే ఈ సినిమా గ్రాండ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ కోసం దర్శక దిగ్గజం ఎస్ ఎస్ రాజమౌళి వచ్చారనే విషయం తెలిసిందే. మరి ఈ సినిమా తాను చూస్తాను అని కూడా చెప్పారు. అయితే విడుదల రోజే కాదు జస్ట్ రీసెంట్ గానే దర్శకుడు రాజమౌళి మైత్రి థియేటర్స్ విమల్ లో పుష్ప 2 చిత్రాన్ని సైలెంట్ గా చూసేసి వచ్చారు.
నిన్ననే జక్కన్న సినిమా చూసారు కానీ సినిమా గురించి ఇంకా స్పందించకపోవడం ఇపుడు ఆసక్తిగా మారింది. తన రెస్పాన్స్ కోసం చాలా మంది ఎదురు చూస్తున్నారు. మరి జక్కన్న పుష్ప 2 గురించి ఎలాంటి రివ్యూ అందిస్తారో చూడాల్సిందే మరి.