జక్కన్న..ప్రిన్స్‌..ఓ మలయాళ స్టార్‌!

జక్కన్న..ప్రిన్స్‌..ఓ మలయాళ స్టార్‌! ప్రస్తుతం ఇండియన్ సినిమా దగ్గర మోస్ట్ అవైటెడ్ ప్రాజెక్ట్ ఏదన్నా ఉంది అంటే అది సూపర్ స్టార్ మహేష్ బాబు అలాగే దర్శక దిగ్గజం ఎస్ ఎస్ రాజమౌళి కాంబినేషన్లో వస్తున్న భారీ సినిమానే అని చెప్పాలి. మరి ఆల్రెడీ షూటింగ్ మొదలు పెట్టుకున్న ఈ చిత్రం కోసం మహేష్ బాబు బీస్ట్ మోడ్ లోకి మారుతుండగా ఈ సినిమాలో మళయాళ స్టార్ నటుడు పృథ్వీ రాజ్ సుకుమారన్ కూడా ఉన్నట్టుగా పలు రూమర్స్ వచ్చాయి. 

దానిపై తాను కూడా ఒకింత పాజిటివ్ గానే రెస్పాన్స్ ఇవ్వడం ఆసక్తిగా మారింది. ఇక లేటెస్ట్ గా తన పోస్ట్ ఒకటి ఇపుడు వైరల్ గా మారింది. “దర్శకునిగా వర్క్ చేసిన సినిమా అన్ని పనులు పూర్తి చేసి హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. దీని తర్వాత నటుడుగా మళ్ళీ తెరపై కనిపించేందుకు సిద్ధం అవ్వడం. 

నీ ప్రాంతానికి చెందిన భాష కాకుండా ఒక భాషలో లాంగ్ లెంగ్త్ డైలాగ్స్ ఉన్నాయి సో నువ్ కొంచెం టెన్షన్ ఫీల్ అవుతున్నావు” అంటూ తన ఫ్రెష్ లుక్ ని చూపిస్తూ పృథ్వీ రాజ్ సుకుమారన్ చేసిన పోస్ట్ ఇపుడు వైరల్ గా మారింది. ప్రభాస్ తో సలార్ 2 ఇప్పట్లో లేదు. అలాగే ఇతర భాష అంటున్నాడు కాబట్టి ఇది డెఫినెట్ గా మహేష్ బాబు, రాజమౌళి ప్రాజెక్ట్ నే అని చెప్పవచ్చు. 

Related Posts

Comments

spot_img

Recent Stories