ఆర్సీ 17 గురించి వైరల్‌ అవుతున్న జక్కన్న వర్డ్స్‌!

ఆర్‌ఆర్‌ఆర్‌ తరువాత చరణ్‌ సినిమా ఒక్కటి కూడా థియేటర్లలోకి రాలేదు. ఆర్‌ఆర్‌ఆర్ వచ్చి కూడా అప్పుడే రెండు సంవత్సరాలు గడిచిపోయాయి. అయినా చరణ్‌ సినిమా ఒక్కటి కూడా రాలేదు. ఈ క్రమంలోనే చరణ్‌ శంకర్‌ తో ఓ సినిమా, బుచ్చి బాబు సాన తో ఓ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే.

మరికొద్ది రోజుల్లో గేమ్‌ ఛేంజర్‌ సినిమా థియేటర్లలోకి రానుంది. ఆర్సీ 16 కూడా త్వరలోనే సెట్స్‌ మీదకు వెళ్లనున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే చరణ్‌, సుకుమార్‌ కలిసి ఓ సినిమా చేస్తున్నట్లు అనౌన్స్‌ మెంట్‌ వచ్చింది. దీంతో అభిమానులకు పండగ అయిపోయింది.ఎందుకంటే చరణ్ సుకుమార్‌ కాంబోలో వచ్చిన రంగస్థలం ఎంత పెద్ద హిట్‌ అయ్యిందో తెలిసిందే.

అయితే ఈ క్రమంలో ఆర్ఆర్‌ఆర్‌ ప్రమోషన్స్‌ లో రాజమౌళి చెప్పిన మాటలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. చరణ్‌ తో సుకుమార్‌ తీస్తున్న సినిమాలో ఓపెనింగ్‌ సీక్వెన్స్ హైలైట్‌ గా నిలుస్తుంది. దీని గురించి నేను ఇంతకు మించి చెప్పకూడదు కూడా. ఆ సినిమాలో ఓపెనింగ్‌ సీన్‌ చూశాక థియేటర్లలో వారు సీట్‌ చివరికి వచ్చేస్తారని నమ్మకంగా చెప్పగలను అంటూ చెప్పారు.

దానికి సంబంధించిన వీడియోలు ప్రస్తుతం నెట్టింట్లో వైరల్‌ గా మారాయి. ఆర్‌ఆర్‌ఆర్ సినిమా క్లైమాక్స్ షూటింగ్‌ సమయంలోనే చరణ్‌ సుకుమార్‌ తో సినిమా చేస్తాడని జక్కన్న చెప్పినప్పటికీ కూడా ఇప్పటి వరకు అనౌన్స్‌ మెంట్‌ రాకపోవడంతో అభిమానులు నిరాశకు గురయ్యారు. ఎప్పుడెప్పుడు ఈ సినిమా గురించి తెలుపుతారా అని ఎదురు చూసిన వారికి ఆర్సీ 17 సినిమా అనౌన్స్ చేయడంతో ఖుషీ అవుతున్నారు.

Related Posts

Comments

spot_img

Recent Stories