జగన్ లంచాల బండారం బయటపెట్టిన మామయ్య!

జగన్మోహన్ రెడ్డి అరాచక వ్యవహార సరళికి తాళలేక ఒకప్పట్లో ఆ పార్టీలో కీలకంగా ఉన్నప్పటికీ.. గుడ్ బై కొట్టేసి ప్రస్తుతం జనసేనలో ఉన్న ఆయన మామయ్య బాలినేని శ్రీనివాసరెడ్డి అనేక సంచలన విషయాలను బయటపెట్టారు. కేంద్రప్రభుత్వరంగ సంస్థ సెకితో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చేసుకున్న ఒప్పందాలు, వాటి వెనుక అదానీ జగన్మోహన్ రెడ్డికి 1750 కోట్ల రూపాలయ ముడుపులు సమర్పించారనే సంగతులు ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా హాట్ టాపిక్ గా నడుస్తున్న సమయంలో.. బాలినేని జోడిస్తున్న వివరాలు ఇంకా విస్తుగొలిపేలా ఉన్నాయి. లంచాల వ్యవహారాన్ని ధ్ర్రువీకరించేలా ఉన్నాయి. జగన్ కు ముడుపులు ముట్టేలా.. అప్పట్లో చక్రం తిప్పిన మరో కీలక మంత్రి, ఇంధన శాఖ కార్యదర్శి శ్రీకాంత్ వ్యవహరించినట్టుగా విశదపరుస్తున్నాయి.
సెకితో ఒప్పందానికి సంబంధించి అప్పట్లోనే చాలా వివాదం రేగింది. అప్పట్లో ఎన్టీపీసీ నుంచి యూనిట్ విద్యుత్తును 1.99 రూపాలయకు కొనేలా గుజరాత్ ఒప్పందం చేసుకోగా.. జగన్ సర్కారు రాబోయే పాతికేళ్ల కాలానికి గాను సెకి నుంచి యూనిట్ 2.49 రూపాయల వంతున ఏడువేల మెగావాట్ల విద్య్తుత్తు కొనడానికి ఒప్పందం చేసుకుంది. దీని మొత్తం విలువ లక్ష కోట్లకు పై మాటే. ఈ స్థాయి ఒప్పందం వెనుక చాలా మంది పనిచేసినట్టుగా బాలినేని మాటలను బట్టి అర్థం అవుతోంది.

సెకితో ప్రభుత్వం చేసుకున్న ఒప్పందం గురించి కేబినెట్లో ఆమోదించడానికి ముందురోజు అర్ధరాత్రి ఒంటిగంట సమయంలో ఇంధన శాఖ కార్యదర్శి శ్రీకాంత్ తనకు ఫోను చేసి ఫైలుమీద సంతకం చేయాల్సిందిగా కోరినట్లు అప్పటి విద్యుత్తు శాఖ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి తాజాగా వెల్లడించారు. అంత పెద్ద ఒప్పందం గురించి కనీసం తనతో ఏమాత్రం సంప్రదించకుండా, తనకు వివరాలు తెలియకుండా.. అది కూడా అర్ధరాత్రి ఫోనుచేసి సంతకం చేయమంటున్నారంటే.. ఏదో మతలబు ఉందనిపించి సంతకం చేయను అని చెప్పినట్టుగా బాలినేని పేర్కొంటున్నారు. ఆ తర్వాత కసేపటికి శ్రీకాంత తన అదనపు పీఎస్ కు ఫోను చేసి ఫైలును కేబినెట్ కు పంపాలని సూచించారని, ఉదయమే కేబినెట్ కు తీసుకువెళ్లిన తర్వాత.. కేబినెట్ అనుమతితో ప్రభుత్వమే అందుకు ఒప్పందం కుదుర్చుకున్నదని బాలినేని వివరాలు వెల్లడించారు. అప్పటి విద్యత్తు మంత్రి అయినప్పటికీ తాను ఎక్కడా ఒక్క సంతకం కూడా చేయలేదని బాలినేని వెల్లడించడం విశేషం. వ్యవహారం మొత్తం నెంబర్ టూగా వ్యవహరిస్తూ వచ్చిన పెద్దరెడ్డి నడిపించారంటూ ఆయన పరోక్షంగా సూచించినది పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పేరునే అని ప్రజల్లో అనుమానాలు కలుగుతున్నాయి. అప్పట్లో అర్ధరాత్రి సంతకం చేసి ఉంటే ఇప్పుడు నా పరిస్థితి ఎలా ఉండేదో అంటూ బాలినేని వాపోతుండడం గమనార్హం. 

Related Posts

Comments

spot_img

Recent Stories