ఏపీ ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డికి పారిశ్రామికవేత్త ఆదానీ ఏకంగా 1750 కోట్ల రూపాయల లంచాలు ముట్ట చెప్పారనేది అమెరికాలోని అత్యున్నత దర్యాప్తు సంస్థ ఎఫ్‌బిఐ తేల్చిన సంగతి. ఈ వ్యవహారంలో జగన్మోహన్ రెడ్డి మీద కూడా అమెరికాలో కేసు నమోదు అయ్యే అవకాశం ఉంది. అమెరికా చట్టాల ప్రకారం లంచం ఇచ్చినవాడు, లంచం తీసుకున్నవాడు ఇద్దరూ కూడా సమానంగా నేరస్తులు అవుతారు. శిక్షలు అనుభవించాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో తమ ప్రభుత్వ హయాంలో జరిగిన నిర్ణయాలలో తప్పేలేదని.. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలకు అదానీ అంచం ఇచ్చే అవకాశమే లేదని మాయ మాటలతో ప్రజలను నమ్మించడానికి జగన్ దళాలు నానా పాట్లు పడుతున్నాయి.
జగన్ అనుచరులు మరియు ఆయన కరపత్రిక వినిపిస్తున్న ఒక ప్రధానమైన వాదన ఏంటంటే జగన్ సర్కారు అప్పట్లో కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ సెకితో మాత్రమే విద్యుత్తు కొనుగోలు ఒప్పందాలను చేసుకుంది. కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ రాష్ట్ర ప్రభుత్వ పాలకులకు లంచాలు ఎందుకు ఇస్తుంది? అనేది వారి వాదన! అయితే సెకి ముసుగులోనే ఇలా విచ్చలవిడి దోపిడీకి పాల్పడ్డారు.. అనేది సాక్షాత్తు ఎఫ్‌బిఐ నిరూపించిన సంగతి. అదానీ ఏర్పాటు చేయదలచిన ప్రాజెక్టులు కార్యరూపం దాల్చాలంటే సెకితో రాష్ట్ర ప్రభుత్వాలకు కొనుగోలు ఒప్పందాలు ఉండాలి.. లేకపోతే అదానీ తలపెట్టిన సోలార్ విద్యుత్తు ప్రాజెక్టు పట్టాలెక్కదు.. అదే జరిగితే వారికి భారీ నష్టాలు వాటిల్లుతాయి.. ఇలాంటి అనేక సమీకరణలను లెక్క వేసుకుని వారు పావులు కదిపారు అనేది ఎఫ్‌బిఐ విచారణ తేల్చిన సంగతి. జగన్మోహన్ రెడ్డికి లంచాలు ఇచ్చింది కూడా సెకితో ఒప్పందం చేసుకోవడానికి మాత్రమే. నేరుగా అదానీతో ఒప్పందాలు చేసుకోవడానికి కాదు. తమాషా ఏంటంటే.. భారతదేశంలో నాలుగు రాష్ట్రాలు సెకితో ఒప్పందాలు చేసుకోవడానికి గాను అదానీ మొత్తం 210 కోట్ల రూపాయల లంచాలు ఇచ్చారని తెలుస్తుండగా.. అందులో 1750 కోట్లు జగన్మోహన్ రెడ్డికి మాత్రమే ఇచ్చారని ఎఫ్‌బిఐ నివేదికల్లో పేర్కొంది.
సెకితో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఒప్పందం చేసుకోవడం అనేది, అదానీమూడు పర్యాయాలు ఆయనతో భేటీ అయిన తర్వాత మాత్రమే జరిగింది. ఎఫ్‌బిఐ కనుక ఆనుపానులు మొత్తం రాబట్టింది. అదానీ జగన్ ను కలిసిన తేదీలన్నీ కూడా రికార్డుల్లోకి వచ్చాయి. విద్యుత్తు కొనుగోలు ఒప్పంద ప్రకటన తేదీలు కూడా రికార్డులతో చేరాయి. స్థూలంగా గమనించినప్పుడు ఈ వ్యవహారంలో జగన్మోహన్ రెడ్డి అరాచక దోపిడీపర్వం సాక్ష్యాధారాలతో సహా దొరికిపోయినట్టే లెక్క కొన్ని రోజుల వరకు రకరకాల మాయ మాటలు చెప్పేవారు ప్రజలను బుకాయించగలరు గానీ.. అంతిమంగా కేసును విచారణను ఎదుర్కోక తప్పదు. లేదా ముందస్తుగా కోర్టులను ఆశ్రయించి రక్షణ పొందక తప్పదు అని విశ్లేషకులు భావిస్తున్నారు.