జగన్ వ్యూహాత్మక నిర్ణయం : ఢిల్లీ దీక్ష వాయిదా!!

ఏపీలో దిగజారిన శాంతి భద్రతలు,  వరుసగా జరుగుతున్న హింసాత్మక సంఘటనలకు నిరసనగా.. వైసిపి అధినేత, ఎమ్మెల్యే జగన్ మోహన్ రెడ్డి ఢిల్లీలో తలపెట్టిన ధర్నాను ప్రస్తుతానికి వాయిదా వేసుకున్నారని విశ్వసనీయంగా తెలుస్తోంది. తర్వాత ఎప్పుడు నిర్వహించేది కొన్నిరోజుల్లో తెలియజేయాలని అనుకుంటున్నారు. ఈమేరకు డిల్లీ లో ధర్నా సన్నాహాల్లో ఉన్న ఎంపీలకు, కార్యకర్తలను తరలించే పనిలో ఉన్న నాయకులకు సమాచారం అందించినట్లు తెలుస్తోంది. జగన్మోహన్ రెడ్డి దేశంలోని అన్ని పార్టీల నాయకులను ధర్నాకు ఆహ్వానించాలని అనుకున్న నేపథ్యంలో.. ఇతర పార్టీలు ఎవ్వరి నుంచీ స్పందన లేకపోగా.. తాను ఒక్కడినే వెళ్లి ధర్నా నిర్వహించడం పరువు తక్కువగా ఉంటుందని భావించిన జగన్, అసహనంతో ప్రస్తుతానికి కార్యక్రమాన్ని వాయిదా వేసుకున్నట్లు తెలుస్తోంది.

చంద్రబాబు నాయుడు ప్రభుత్వం తమ పార్టీ వారిని వేధింపులకు గురి చేస్తున్నదని, హింసకు పాల్పడుతున్నాడని జగన్ ఆరోపిస్తున్నారు. వినుకొండలో రౌడీ షీటర్ వ్యక్తిగత కారణాలతో హత్యకు గురైతే.. దానిని రాజకీయ హత్యగా భూతద్దంలో చూపిస్తూ యాగీ చేస్తున్నారు. రషీద్ హత్యను భుజానికి ఎత్తుకోవద్దని కొందరు పార్టీ సీనియర్లు సూచించినా జగన్ వినలేదని విశ్వసనీయ సమాచారం. డిల్లీ లో ధర్నాకు పిలుపు ఇవ్వడంతో పాటు, దేశంలో అన్ని పార్టీల నేతల్ని ఆహ్వానించాలని తన పార్టీ ఎంపీ లను పురమాయించారు.

కానీ ఏ ఒక్క పార్టీ వారు కూడా వీరికి మొహం చూపించడం లేదు అని తెలుస్తోంది. రకరకాల సాకులు చెప్పి ధర్నాకు రాలేం అని తప్పించుకుంటున్నారట. కొందరు జగన్ కు తాము మద్దతు ఇవ్వలేం అని మొహం మీదనే చెప్పేస్తున్నారట. ఇతర పార్టీల వారిని ఆహ్వానించాలనే ఆలోచనకు ఎవరూ స్పందించడం లేదని ఎంపీలు జగన్ తో చెప్పినట్టు తెలుస్తోంది.

ఒకసారి అలా చేస్తాం అని ప్రకటించిన తరువాత.. ఇతర పార్టీల నాయకులు ఒకరు కూడా లేకుండా.. ధర్నా చేస్తే పరువు పోతుందని జగన్ అసహనానికి గురైనట్లు సమాచారం. ప్రస్తుతానికి వాయిదా వేసుకోవాలని అనుకుంటున్నట్లుగా తెలుస్తోంది.

Related Posts

Comments

spot_img

Recent Stories