జగన్ పేదరికంపై పవర్ స్టార్ ఎటాక్!

ముఖ్యమంత్రిగా అధికారంలోకి వచ్చిన తర్వాత వైఎస్ జగన్మోహన్ రెడ్డి కొన్ని కొత్త పదాలను నేర్చుకున్నారు. ‘క్లాస్ వార్’ అనేది అలాంటి పదాలలో ఒకటి! సీఎం అయిన రోజు నుంచి- ఏ వేదిక ఎక్కి ఏ సందర్భంలో ప్రసంగిస్తున్నా సరే సందర్భశుద్ధి లేకుండా తనకు ప్రతిపక్షాలకు మధ్య క్లాస్ వార్ జరుగుతున్నదని జగన్ మోహన్ రెడ్డి అంటూ ఉంటారు. రాష్ట్రంలో జరుగుతున్నది పేదలకు- పెత్తందారులకు మధ్య పోటీ అని, సమరమని ఆయన రకరకాలుగా అభివర్ణిస్తూ ఉంటారు. తాను పేదవాడినని, తనకు మీడియా గానీ, సొంత పత్రికలు గాని, టీవీ ఛానల్‌లు గానీ లేవని రకరకాలుగా తన పేదరికం గురించి ఆయన ప్రకటనలు చేస్తూ ఉంటారు. అయితే  ఆ రకంగా జగన్మోహన్ రెడ్డి చెప్పుకునే పేదరికం గురించి పవన్ కళ్యాణ్ తాజాగా తన ప్రచార సభలో ఒక రేంజిలో ఫైర్ అయ్యారు. ఊరికొక రాజ భవనం కట్టుకొని తులతూగుతూ ఉండే జగన్మోహన్ రెడ్డి- పేదవాడా అని పవన్ ప్రశ్నిస్తున్నారు. ఆయనకు సొంత పత్రిక సొంత టీవీ ఛానల్ ఉన్న సంగతి ప్రజలకు తెలియదా? ఇంత దారుణంగా అబద్ధాలు చెప్పే వ్యక్తిని ప్రజలు ఎందుకు నమ్మాలి? ఎలా నమ్ముతారు? అని పవన్ కళ్యాణ్ ప్రశ్నిస్తున్నారు!!

రాష్ట్రవ్యాప్తంగా ప్రజలను అనేక రకాలుగా జగన్మోహన్ రెడ్డి మోసం చేశారని పవన్ ఆరోపిస్తున్నారు. రాష్ట్రంలో ఏ మూల కూడా ఏ ప్రాంతంలో కూడా నిర్దిష్టమైన ఒక్క అభివృద్ధి కార్యక్రమాన్ని కూడా ఈ ప్రభుత్వం చేపట్టలేదని పవన్ చెప్పుకొచ్చారు. రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో తీసుకెళ్లే ప్రయత్నంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం సవ్యంగా పనిచేసే ఉంటే గనుక, ఈరోజున పవన్ కళ్యాణ్ అవసరంలేనే లేదని, వారు అలా చేయకపోయినందువలన మాత్రమే తాను క్రియాశీలంగా తలపడాల్సి వస్తున్నదని పవన్ కళ్యాణ్ వివరణ ఇచ్చుకున్నారు.

రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో తీసుకువెళ్లాలని ఏకైక లక్ష్యంతో మాత్రమే జనసేన తెలుగుదేశం భారతీయ జనతా పార్టీ మూడు కలిసి పొత్తు పెట్టుకున్నాయని ఆయన కూడా ఆయన వివరించారు. పదేపదే తన పేదరికం చెప్పుకుంటూ, ప్రజలను ఎన్నిసార్లయినా మోసం చేయగలనని అనుకునే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వైఖరికి పవర్ స్టార్ మాటలు చెంపపెట్టు లాంటివని ప్రజలు వ్యాఖ్యానిస్తున్నారు. ప్రత్యేకించి.. తాను పేదవాడిని అని పదేపదే చెప్పుకునే కొద్దీ.. ప్రజల్లో అబద్ధాలు చెప్పే నాయకుడిగా జగన్ గురించి అందరూ అనుకుంటారే తప్ప.. అలాంటి నాటకీయమైన మాటలను ఒక్కరు కూడా నమ్మరు అనే అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతోంది.

Related Posts

Comments

spot_img

Recent Stories