జగన్ భక్త అధికారుల్ని కిమ్ అయితే చంపేస్తారంతే!

వరద ముప్పు ఇప్పుడిప్పుడే శాంతిస్తోంది. ప్రజలు మళ్లీ సాధారణ జీవితంవైపు మళ్లడానికి సిద్ధమవుతున్నారు. రాష్ట్రవ్యాప్తంగా అన్ని ప్రాంతాలనుంచి అగ్నిమాపక శాఖ వారి శకటాలను కూడా రప్పించారు. బురదతో నిండిపోయిన ఇళ్లు గ్రామాలను శుభ్రం చేయడానికి వీటిని ఉపయోగిస్తారు. బాధిత పౌరులందరూ శిబిరాలకు, సురక్షిత ప్రాంతాలకు తరలినట్టే. సహాయక చర్యలు ఇంకా ముమ్మరంగా జరుగుతున్నాయి. కానీ.. ఈ వరద సహాయక పనుల్లో.. తొలిరోజుల్లో ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసినా కూడా… జగన్ భక్తులైన కొందరు అధికారులు ఆ సాయం చివరిలెవెల్ వరకు ఇబ్బంది పడుతున్న ప్రజలకు అందేలా చూడకుండా రాజకీయం చేశారనే ఆరోపణలు ప్రజలకు ఆగ్రహం తెప్పిస్తున్నాయి. ఇలాంటి దుర్మార్గులైన అధికారులకు ఎలాంటి శిక్షలు వేసినా పర్వాలేదని ప్రజలు అంటున్నారు.

జగన్ హయాంలో కొందరు పోలీసు అధికారులు తమదే రాజ్యం అన్నట్టుగా చెలరేగిపోయారు. ఐపీఎస్ ల్లో కొందరి సంగతైతే చెప్పే పనేలేదు. విచ్చలవిడిగా వ్యవహరించారు. జగన్ పట్ల వీరభక్తిని ప్రదర్శించుకోవడానికి తెలుగుదేశం, విపక్షపార్టీలకు చెందిన వారిని మాత్రమే కాదు.. ప్రభుత్వానికి వ్యతిరేకంగా తమ అభిప్రాయాలు వెల్లడించిన సామాన్య ప్రజలను కూడా దారుణంగా కేసులు పెట్టి వేధించారు. అలాంటి దుర్మార్గులైన జగన్ భక్త అధికారుల్ని చంద్రబాబు సర్కారు సహజంగానే పక్కన పెట్టింది. అయితే.. వరద విపత్తు తలెత్తిన సందర్భంలో కొన్ని ప్రాంతాల్లో పర్యవేక్షణ విధులు నిర్వర్తించడానికి ఆ ఐపీఎస్ అధికారుల్ని కూడా వాడుకుంది.

అయితే జగన్ భక్తితో వారు ఇబ్బందులు పడుతున్న ప్రజలకు ద్రోహం చేశారనే మాట వినిపిస్తోంది. ప్రభుత్వాన్ని చెడ్డపేరు తీసుకురావడానికి ఆహారపొట్లాలు పంచకుండా, చివరి వరకు సహాయక బృందాలను పంపకుండా చేశారనే ఆరోపణలున్నాయి. ఆహార పొట్లాలు వస్తే.. వాటిని కనీసం పంచకుండా అలాగే రోడ్ల పక్కన పారేయించారన్న ఆరోపణలు కూడా ఉన్నాయి. అయితే అధికారులు ఇంత దుర్మార్గంగా వ్యవహరించినట్లు తెలియడంతో, చంద్రబాబునాయుడు వారి మీద గుస్సా అయ్యారు. పద్ధతి మార్చుకోకపోతే కఠిన చర్యలుంటాయని హెచ్చరించారు.

చంద్రబాబునాయుడు గనుక.. వారిని హెచ్చరించి వదిలేశారని.. ఇలాంటి తప్పులు ఉత్తర కొరియాలో జరిగి ఉంటే గనుక.. అక్కడ ఆ అధికారులందరినీ చంపిపారేసేవారని ప్రజలు మాట్లాడుకుంటున్నారు. ఉత్తరకొరియాలో ఇటీవల భారీ వర్షాలు, వరదలు వచ్చాయి. ప్రజాజీవితం అతలాకుతలం అయింది. విపత్తు నిర్వహణలో కొందరుఅధికారులు సక్రమంగా వ్యవహరించలేదని, విఫలమయ్యారని విమర్శలు వచ్చాయి. అలాంటి 30 మంది అధికార్లకు మరణశిక్ష అమలు చేయాలని కిమ్ ఆదేశించినట్టుగా వార్తలు వస్తున్నాయి. వరదల సందర్భంలో మోకాటిలోతు నీళ్లలో కిమ్ స్వయంగా డ్రైవ్ చేసుకుంటూ వెళ్లి సహాయక చర్యలు పర్యవేక్షించారు. నిర్లక్ష్యం వహించిన అధికారులకు మరణశిక్ష వేశారు. రాష్ట్రంలో కూడా అలాంటి నిర్లక్ష్యం చూపించిన దుష్ట అధికార్లకు కిమ్ వంటి ప్రభుత్వాధినేత ఉండాలని ప్రజలు అనుకుంటున్నారు.

Related Posts

Comments

spot_img

Recent Stories