టీటీడీకి శఠగోపం పెట్టిన జగన్ గురువుకు షాక్!

విశాఖపట్టణం చిన్న ముషిడివాడలో శారదాపీఠం పేరుతో ఓ ఆశ్రమం పెట్టుకుని.. ఎంచక్కా ప్రభుత్వం నుంచి మరింతగా భూములు పొందుతూ ఆధ్యాత్మకి ఆర్జన మార్గంలో ఉన్న స్వరూపానందేంద్ర తెలియనివారు రెండు తెలుగురాష్ట్రాల్లోనూ ఉండరు. నేను మోనార్క్ ని అని భావిస్తూ ఉండే తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్, నేను మోనార్క్ కంటె మొనగాడిని అని నిత్యం చాటుకుంటూ ఉండే జగన్మోహన్ రెడ్డి ఇద్దరూ కూడా ఈ స్వామీజీకి వీరభక్తులు. తాము ఎన్నికల్లో గెలవడానికి ఆయనతో వీరు యజ్ఞాలు యాగాలు ఇతరత్రా పూజలు చేయించుకుంటూ ఉంటారు. ఆయన కనిపిస్తే చాలు.. పాదాలు స్పృశించి సాష్టాంగ ప్రమాణాలు ఆచరిస్తూ ఉంటారు. అలాంటి జగన్ మెచ్చిన హిందూ ఆధ్యాత్మిక గురువు గారికి.. తిరుమల తిరుపతి దేవస్థానాల వారు గట్టిగానే షాక్ ఇచ్చారు. విశాఖ శారదా పీఠం తరఫున తిరుమలలో భవనాలు కట్టుకోవడానికి, గతప్రభుత్వ హయాంలో స్థలాలు పొందారు. అయితే నిర్మాణంలో నిబంధనలను విచ్చలవిడిగా ఉల్లంఘించి.. వాటన్నింటికీ కూడా జగన్ ప్రాపకం ద్వారా క్రమబద్ధీకరింపజేసుకున్నారు. అక్రమాలకు అరాచకాలకు మారుపేరైన జగన్ యొక్క గురువుగారు.. తన ముద్రగల అక్రమాలతో చెలరేగితే.. ప్రస్తుత టీటీడీ పాలకమండలి దిమ్మతిరిగే షాక్ ఇచ్చింది. తిరుమలలో గోగర్భం డ్యాం సమీపంలో శారదా పీఠం వారు అక్రమంగా నిర్మించిన భవనాల్లోంచి మఠాన్ని 15 రోజల్లోగా ఖాళీచేసి, భవనాలను తమకు అప్పగించాలని ఆ నోటీసుల్లో హుకుం జారీచేశారు.

జగన్మోహన్ రెడ్డి పాలన కాలంలో.. శారదాపీఠం స్వరూపానందేంద్ర తన ఇష్టారాజ్యంగా చెలరేగిపోయారు. ఐహిక బంధాలు, వాంఛలు ఉండరాదనే ఆధ్యాత్మిక మార్గంలోని ఈ స్వామీజీ భూదాహంతో శృతిమించారు. విశాఖలో చిన్న ముషిడివాడలో ఉండే తన ఆశ్రమానికి ఆనుకుని ప్రభుత్వ భూములను జగన్ ద్వారా పొందారు. అలాగే తిరుమలలో గోగర్భం  డ్యాం వద్ద శారదాపీఠం ఉండగా, దాని ముందు వెనుకా ఇష్టారాజ్యంగా నిబంధనలు ఉల్లంఘించి నిర్మాణాలు చేపట్టారు. జగన్ ఎప్పుడూ తన కాళ్లమీద పడి మొక్కే నాయకుడే కదా.. మన మాటకు ఎదురేముంటుంది అనుకున్నారు. దానికి తగ్గట్టుగానే.. ఆ అక్రమ నిర్మాణాలు అన్నింటినీ.. జగన్ సర్కారు క్రమబద్ధీకరించేసింది.

దీనిపై హిందూ సంఘాలు మఠం ఎదుట ఆందోళనలు చేశాయి. కూటమి అధికారంలోకి రాగానే.. తిరుమలనుంచే అక్రమాలను చక్కదిద్దడం మొదలవుతుందని చంద్రబాబు అప్పట్లోనే చెప్పారు. తితిదే అధికారుల కమిటీ ఇచ్చిన నివేదికలో శారదాపీఠం భవనాల నిర్మాణల్లో అవకతవకలు ఉన్నాయని తేల్చారు. ఈ ఆక్రమణలను తొలగించి తీరుతాం అన్న ఛైర్మన్ బీఆర్ నాయుడు, శారదాపీఠం వారికి ఎస్టేట్ విభాగం ద్వారా నోటీసులు జారీచేయించారు. దీనిపై శారదాపీఠం హైకోర్టును ఆశ్రయించింది. నిబంధనలను ఉల్లంఘించినట్టుగా న్యాయస్థానం గుర్తించింది. మఠంపై టీటీడీ చర్యలు తీసుకోవచ్చునని చెప్పింది. హైకోర్టు తీర్పు పర్యవసానంగా.. 15 రోజుల్లగో ఆ మఠాన్ని ఖాళీచేసి టీటీడీకి అప్పగించాలని శారదాపీఠం వారికి నోటీసులు పంపింది. జగన్ అక్రమాలకు ఆధ్యాత్మిక మద్దతు పలుకుతూ.. తన శైలిలో దోపిడీ పర్వానికి తెరతీసిన స్వరూపానందేంద్రకు తగిన శాస్తి జరిగిందని అంతా అంటున్నారు.

Related Posts

Comments

spot_img

Recent Stories