జగన్ కు ఫ్రస్ట్రేషన్ : దోచినసొమ్ము పోలీసుల పాలు!

మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని అత్యంత అసహనానికి, ఫ్రస్ట్రేషన్ కు గురిచేసే వ్యవహారం ఇది. లిక్కర్ కుంభకోణంలో రాజ్ కెసిరెడ్ నెట్‌వర్క్ దోచుకున్న సొమ్ములో ఇంకా బిగ్ బాస్ కు చేరవేయకుండా మిగిలిఉన్న ఒక మొత్తాన్ని సిట్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. హైదరాబాదులో శంషాబాద్ సమీపంలోని కాచారం గ్రామం వద్ద ఒక ఫాంహౌస్ లో దాచి ఉంచిన నగదు పోలీసుల  పరమైంది. మొత్తం 12 అట్టపెట్టెలలో దాచి ఉన్న 11 కోట్ల రూపాయలను స్వాధీనం చేసుకున్నట్టుగా సిట్ పోలీసులు ప్రకటించారు. వసూళ్ల నెట్వర్క్ కింగ్ పిన్ రాజ్ కెసిరెడ్డి అనుచరులు బూనేటి చాణక్య, వరుణ్ ఇచ్చిన సమాచారం మేరకే ఈ సొత్తు స్వాధీనం జరిగినట్టుగా తెలుస్తోంది. దండుకున్న డబ్బు కూడా పోలీసులకు దొరికిపోవడంతో మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఫ్రస్ట్రేషన్ కు గురవుతుంటారని ప్రజలు అనుకుంటున్నారు.

నాలుగు నెలలకు పైగా రాష్ట్రం మొత్తం జగన్మోహన్ రెడ్డి అయిదేళ్లలో సాగించిన దోపిడీ పర్వం గురించి మాత్రమే మాట్లాడుకుంటున్నారు. మద్యం నిషేధిస్తాను, వాడకం తగ్గిస్తాను అనే ముసుగులో కొత్త లిక్కర్ పాలసీ తీసుకువచ్చి, ధరలను అమాంతం పెంచేసి.. డిస్టిలరీలనుంచి జగన్ దోచుకున్న మూడున్నర వేల కోట్లరూపాయల దందా.. రాష్ట్రప్రజలను షాక్ కు గురిచేస్తున్న వ్యవహారం. నాలుగునెలలకు పైగా ఈ కేసును సిట్ దర్యాప్తు చేస్తున్నది. 13 మంది అరెస్టు అయ్యారు. ఇంకా అనేక మంది అరెస్టు అయ్యే అవకాశం ఉంది. మొత్తం 41 మంది నిందితులుగా ఉన్నారు. కానీ.. వైసీపీ దళాలు మాత్రం తమ మాటల్లో ఎదురుదాడికి దిగుతూ వచ్చారు.
రాజకీయ కక్షలతో మా పార్టీ నాయకులను వేధిస్తున్నారు. అన్యాయంగా కేసులు పెడుతున్నారు. ఈ వేధింపులకు ఫుల్ స్టాప్ పెట్టాలి.. లాంటి మాటలు వల్లిస్తూ వచ్చారు. 41 మంది మీద కేసులు పెట్టారు. ఒక్క ఆధారామైనా దొరికిందా? ఒక్క రూపాయైనా దొరికిందా? లాంటి సవాళ్లు విసిరారు. ఇప్పుడు అలాంటి నోర్లన్నీ మూతపడాల్సిందే. దాచిపెట్టిన మద్యం దోపిడీ సొమ్ము 12 కోట్ల రూపాయల నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
జగన్మోహన్ రెడ్డి మంగళవారం నాడు ప్రెస్ మీట్ నిర్వహించి.. అరెస్టు అయి జైల్లో ఉంటున్న తమ పార్టీ వారందరూ ఎంతటి మంచివాళ్లో కితాబులిస్తూ ప్రభుత్వాన్ని నిందించారు. ప్రధానంగా పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి గురించి కూడా ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. మిథున్ రెడ్డి తనకు సన్నిహితుడు గనుకనే అరెస్టు చేశారని  అన్నారు. ఆయనకు రాష్ట్ర వ్యవహారాలతో సంబంధం ఏముంటుందని కూడా అన్నారు. అసలు స్కామ్ అన్నదే జరగలేదని, లేని దానిపై తప్పుడు కేసులు పెడుతున్నారని అన్నారు. స్కామ్ జరిగిందో లేదో ఇప్పుడు బయటపడుతోంది. బూనేటి చాణక్య, వరుణ్ ఇచ్చిన సమాచారం మేరకు డిస్టిలరీలనుంచి దోచుకున్న సొమ్ము దాచిన చోటు తెలిసింది. హైదరాబాదు వచ్చి పోలీసులు ఆ సొమ్మును స్వాధీనం చేసుకున్నారు. ఇంకా అనేక చోట్ల వేర్వేరు మొత్తాలు ఈ మద్యం కుంభకోణంలో భాగస్వాములు అయిన మాఫియా దాచి ఉంచినట్టుగా పోలీసులు అనుమానిస్తున్నారు. ఇంకా కీలక వివరాలు కూడా త్వరలో నిందితుల్ ద్వారానే బయటకు వస్తాయని అనుకుంటున్నారు.

Related Posts

Comments

spot_img

Recent Stories