వర్మకు వకాలత్తుగా జగన్ అజ్ఞాన ప్రదర్శన!

జగన్మోహన్ రెడ్డి తాను చెప్పే అర్థసత్యాలతో, అసత్యాలతో ప్రపంచాన్ని మోసం చేసేయగలనని ఇంకా అనుకుంటున్నారు. ఆయన మాటలను ప్రజలు ఏమాత్రం నమ్మడం లేదని.. సార్వత్రిక ఎన్నికలు నిరూపించిన తర్వాత కూడా జగన్మోహన్ రెడ్డికి తెలివి రాలేదు. ఆ ఎన్నికల సమయంలో చంద్రబాబునాయుడు గురించి ఎన్ని రకాల వదరుబోతు మాటలు మాట్లాడారో ప్రజలందరికీ తెలుసు. చంద్రబాబు ఇస్తున్న హామీలన్నీ అబద్ధాలంటూ జగన్ ప్రజలను నమ్మించడానికి నానా పాట్లు పడ్డారు. ప్రజలు ఆయన వాదనలను, ఆయన చెబుతున్న అబద్ధాలను, చంద్రబాబు మీద నిందలు వేస్తున్న తీరును అసహ్యించుకున్నారు. ఇప్పటికీ ఆయనలో అదే అర్థసత్యాలతో ప్రజలను వంచించే దోరణి అలాగే కనిపిస్తోంది.

సినిమా దర్శకుడు రాంగోపాల్ వర్మ మీద ఏపీలో కేసులు నమోదు అయిన మాట నిజం. అయితే ఆయన తరఫున జగన్ వకాలత్తు పుచ్చుకుంటున్నారు. రాంగోపాల్ వర్మ మీద తప్పుడు కేసులు నమోదు చేశారని అంటున్నారు. మీరు సినిమాలు తీస్తే మాత్రం కరెక్టు.. మేం సినిమాలు తీస్తే మాత్రం తప్పా? అని ఆయన ప్రశ్నిస్తున్నారు. వైఎస్ వివేకానందరెడ్డి  హత్యోదంతాన్ని విపులంగా తెలియజెబుతూ వచ్చిన వివేకం సినిమాను ఆయన ప్రస్తావిస్తున్నారు. నిజానికి వివేకం సినిమా జగన్ పాలన జరుగుతున్న రోజుల్లోనే వచ్చింది. అందులో అబద్ధాలు ఉన్నట్టుగా, వ్యక్తిత్వ హననం ఉన్నట్టుగా జగన్ దళం భావించి ఉంటే.. ఆ సమయంలోనే వారు కేసులు పెట్టి ఉండొచ్చు. చర్యలు తీసుకుని ఉండొచ్చు. కానీ అలాంటిదేం జరగనే లేదు. తీరా ఇప్పుడు వర్మ మీద కేసులు నమోదు అయ్యాక జగన్ ఆ వాదన తెస్తున్నారు. ఆర్జీవీ తీసిన సినిమాలు సెన్సార్ అయ్యాయని, సెన్సార్ అనుమతులతోనే వచ్చాయని అంటున్నారు.

ఇంతకూ జగన్ అజ్ఞానం ఏంటంటే.. రాంగోపాల్ వర్మ మీద నమోదైన కేసులు ఆయన తీసిన వ్యూహం సినిమాకు సంబంధించి కాదు. సినిమా తర్వాత.. ఆ ప్రమోషన్స్ కోసం ఆయన పెట్టిన సోషల్ మీడియా పోస్టుల మీద! సోషల్ మీడియా పోస్టుల కేసులే వర్మ మీద కూడా నమోదు అయ్యాయి. అయితే ప్రజలను తప్పుదారి పట్టిస్తూ సెన్సారు అయిన సినిమా మీద కేసులు నమోదు అయినట్టుగా జగన్ వక్రీకరిస్తూ తన బుద్ధి బయటపెట్టుకుంటున్నారు. జగన్ మాటలు ఖచ్చితంగా ప్రజలను తప్పుదోవ పట్టించడమే అని అంతా అనుకుంటున్నారు. పైగా ఈ వ్యవహారంలో రాంగోపాల్ వర్మ అరెస్టు కాక తప్పదనే వాదన కూడా వినిపిస్తోంది. ఆయన కూడా అందుకే పోలీసు విచారణకు వెళ్లకుండా మళ్లీ మళ్లీ క్వాష్ కోసం, బెయిలు కోసం కోర్టును ఆశ్రయిస్తున్నట్టు సమాచారం. 

Related Posts

Comments

spot_img

Recent Stories