పోలీసు విచారణలో జగన్ భక్తుల చావుతెలివి!

పోలీసులు విచారణకు అనుమానితులు లేదా నిందితులను పిలిచినప్పుడు.. వారి ప్రశ్నలకు ‘మీకెందుకు చెప్పాలి.. నేను కోర్టుకు మాత్రమే చెబుతా’ అనే సమాధానం మనం ఊహించగలమా? అలాంటి జవాబు చెప్పాలంటే చాలా తెగింపు ఉండాలి. అయినా అప్పటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మీద భక్తితో- ఒక వ్యక్తిని- పోలీసు విచారణ పేరుతో చంపడానికే ప్రయత్నించాడనే ఆరోపణలు ఎదుర్కొంటున్న మరో మాజీ పోలీసు అధికారి కి ఆ మాత్రం తెగింపు ఉండడంలో ఆశ్చర్యం లేదు. అందుకే ఎమ్మెల్యే రఘురామక్రిష్ణ రాజు మీద గతంలో హత్యాయత్నం చేసినట్టుగా ఆరోపణలు ఎదుర్కొంటున్న దర్యాప్తు అధికారి విజయపాల్ ప్రస్తుతం విచారణలో చిత్రమైన సమాధానాలు చెబుతున్నారు.

జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉండగా.. ఆయనకు అధికారం మరో నలభయ్యేళ్ల పాటు శాశ్వతం అనుకునే తరహాలో, ఆయన భక్తులు చెలరేగిపోయారు. ప్రభుత్వయంత్రాంగంలో భాగంగా ఉన్న భక్తుల గురించి చెప్పాల్సిన అవసరమే లేదు. ప్రభుత్వం పనితీరులో లోపాలను ఎత్తిచూపించినందుకు జగన్, తన సొంత పార్టీకి చెందిన ఎంపీ రఘురామక్రిష్ణ రాజు మీద పోలీసు కేసు పెట్టించారు. విచారణపేరుతో ఆయనను పోలీసులు నిర్బంధించి హింసించారు అనే ఆరోపణలున్నాయి. ఆ తర్వాత ఆయన బెయిలుమీద బయటకు వచ్చారు.

ప్రభుత్వం మారింది. జగన్ మరియు కొందరు పోలీసు అధికారుల మీద రఘురామ హత్యాయత్నం కేసులు పెట్టారు. విచారణ మొదలైంది కూడా. ఆయన నిందితులుగా పేర్కొన్న పోలీసు అధికారులో.. ఆ కేసును అప్పట్లో దర్యాప్త్తు చేసిన విజయపాల్ కూడా ఉన్నారు. కేసు పెట్టిన తర్వాత విజయపాల్ ముందస్తు బెయిలు కోసం హైకోర్టులో పిటిషన్ వేశారు గానీ.. నిరాశ ఎదురైంది. కేసును కొట్టేశారు. అప్పటినుంచి అరెస్టు నుంచి తప్పించుకోవడానికి అజ్ఞాతంలోకి వెళ్లిపోయిన విజయపాల్.. సుప్రీంను ఆశ్రయించారు. కేసు దర్యాప్తునకు సహకరించాల్సిందిగా సుప్రీం ఆదేశించింది. తాజాగా ఆయన గుంటూరులో పోలీసుల ఎదుట విచారణ నిమిత్తం హాజరయ్యారు గానీ.. ఒకటిరెండు ప్రశ్నలకు తప్ప సూటిగా జవాబులు చెప్పనేలేదు. విచారణలో ఎవరు పాల్గొన్నారు అనే ప్రశ్నకు కూడా ఒకటిరెండు పేర్లు తప్ప.. తనకు తెలియదని, వయసు పైబడి మతిమరుపు వచ్చిందని చెప్పడం విశేషం. అన్ని విషయాలు కేసు డైరీలో రాశారా అంటే అసలు జవాబే లేదు. బెయిల్ పిటిషన్ కొట్టేశాక అజ్ఞాతంలోకి ఎందుకు వెళ్లారు.. ఫోను ఎందుకు స్విచాఫ్ చేశారని అడిగితే.. తాను రాష్ట్రంలోనే ఉన్నానని, రిటైరయ్యాను గనుక తనకు ఫోనుతో పనిలేదని అందువల్ల సరిగా వాడడం లేదని సెలవివ్వడం ఇంకా చిత్రం. బెయిల్ పిటిషన్ కొట్టేశాక ఎక్కడ తలదాచుకున్నారని పోలీసులు అడిగితే… అదంతా నా వ్యక్తిగతం, మీకు జవాబు ఎందుకు చెప్పాలి? అనడం ఇంకా చిత్రం.

రఘురామ క్రిష్ణరాజు పై జగన్ సర్కారు చేయించిన హత్యాయత్నానికి సంబంధించిన కేసు గట్టిగానే బిగుసుకుంటున్నట్టుగా కనిపిస్తోంది. విజయపాల్, మరికొందరు పోలీసు అధికారుల విచారణ తర్వాత.. మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని కూడా విచారణకు పిలుస్తారని తెలుస్తోంది.

Related Posts

Comments

spot_img

Recent Stories