పేదోడి వైద్యం పేరుతో అర్థం లేని మాయమాటలు!

మెడికల్ కాలేజీలను ఒక పద్ధతి ప్రకారం అందరికీ అందుబాటులో ఉండేలా నాణ్యమైన విద్యావసతులతో నడపడానికి ఎన్డీయే కూటమి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను జగన్మోహన్ రెడ్డి సహించలేకపోతున్నారు. తన పాలన కాలంలో అసంపూర్తిగా, అవకతవకగా ప్రారంభించిన జగన్మోహన్ రెడ్డి.. కూటమి ప్రభుత్వం పీపీపీ పద్ధతిలో వాటిని సంపూర్ణ వసతులతో, టీచింగ్ ఫాకల్టీతో నిర్వహించాలని అనుకుంటూ ఉంటే ఓర్వలేకపోతున్నారు. పీపీపీ ఆలోచనకు ప్రెవేటీకరణ అనే ముసుగువేసి రాద్ధాంతం చేయడానికి ప్రయత్నిస్తున్నారు. నర్సీపట్నం మెడికల్ కాలేజీని సందర్శించడం కూడా అలాంటి నాటకాల్లో ఒక భాగమే. అయితే.. ఈ సందర్భంగా జగన్ చెబుతున్న మాయమాటలను జాగ్రత్తగా గమనించాల్సి ఉంది. మెడికల్ కాలేజీలను ప్రెవేటీకరిస్తే పేదోడికి వైద్యం అందడం ఎలాగ? అని ఆయన మొసలి కన్నీరు కారుస్తున్నారు. ఇదంతా కేవలం ఒక అబద్ధాన్ని ప్రచారం చేయడం మాత్రమే అని ప్రజలు భావిస్తున్నారు.

జగన్ ఇవాళ పేదోడి వైద్యం, పేదోడి వైద్యం అంటూ రాగాలు తీస్తున్నారు. అంటే ఏమిటి? ఈ మెడికల్ కాలేజీలు రాకపూర్వం పేదోడి వైద్యానికి అసలు రాష్ట్రంలో దిక్కూమొక్కూ లేకుండా ఉన్నదా.. అనేది కీలకంగా ఆలోచించాల్సిన అంశం. పేదలకు వైద్యం అందించడానికి అన్ని స్థాయుల్లోనూ ప్రభుత్వ ఆస్పత్రులు ఉన్నాయి. పెద్ద పెద్ద అనారోగ్య సమస్యలకు కూడా మెరుగైన చికిత్స అందించడానికి రీజినల్ ఆస్పత్రులు కూడా ఉన్నాయి. ఇవన్నీ పేదలకు నిరుపమాన సేవలు అందిస్తూనే ఉన్నాయి. మెడికల్ కాలేజీలు అనేవి వాటన్నింటికీ అదనంగా ఏర్పాటు చేస్తున్న వ్యవస్థలు. అవి పీపీపీ పద్ధతిలోకి వెళ్లినంత మాత్రాన అసలు పేదోడికి వైద్యం అందనే అందదు అన్నట్టుగా జగన్ ఆక్రోశించడం అర్థంలేని మాయ అని ప్రజలు అనుకుంటున్నారు.

పేదలకు వైద్యం అందించడానికి అన్ని స్థాయుల్లో ఆస్పత్రులు ఉన్నాయి. ప్రభుత్వ ఆస్పత్రుల్లో చికిత్స అందుబాటులో ఉండనంత పెద్దరోగాలు వస్తే.. ప్రెవేటు కార్పొరేట్ ఆస్పత్రులకు వెళ్లినా కూడా.. వారికి పూర్తిస్థాయిలో వైద్యఖర్చులు ఆరోగ్యశ్రీ ద్వారా అందుతుంది. దాదాపుగా అన్ని రకాల కీలక రోగాలకు ఆరోగ్యశ్రీ వర్తిస్తోంది. ఇలాంటి విస్తృత ఏర్పాట్లు ఉన్నప్పుడు.. అసలిక పేదవాడికి ఏ స్థాయి సమస్య వచ్చినా వైద్యం ఉచితంగానే అందుతోంది. అయినా సరే.. జగన్ మెడికల్ కాలేజీలను పీపీపీ పద్ధతిలోకి మారుస్తుండడాన్ని ఒక బూచిగా చూపిస్తూ.. పేదలకు వైద్యం అందదు అనడంలో అర్థముందా? అనేది విశ్లేషకుల మాట.

లెక్చరర్లను నియమించకుండా, ల్యాబ్ లు కూడా ఏర్పాటు చేయకుండా.. జగన్ పెట్టిన మెడికల్ కాలేజీలను పూర్తిస్థాయి నాణ్యమైన విద్య అందించేలా.. ప్రభుత్వ ఆధీనంలోనే ఉంచుకుని, పీపీపీ పద్ధతిలో నిర్వహించడానికి ప్రభుత్వం పూనుకుంటోంటే.. జగన్ మోకాలడ్డుతుండడాన్ని ప్రజలు కూడా అసహ్యించుకుంటున్నారు.

Related Posts

Comments

spot_img

Recent Stories