ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తను సుద్దపూసనని, తాను ముఖ్యమంత్రిగా ఉన్న రోజుల్లో రాష్ట్రాన్ని ఆర్థికంగా పరుగులు పెట్టించానని.. తన ప్రభుత్వకాలంలో ఉన్నంతటి ఆర్థిక వృద్ధి ప్రపంచంలో మరెక్కడా లేదని ప్రెస్ మీట్ పెట్టి.. సొంత డబ్బా కొట్టుకుంటున్న సమయానికి.. బహుశా అమెరికాలో ఆయన పాపాల పుట్ట పగులుతోంది. అంతర్జాతీయంగా వ్యాపారాలు నిర్వహిస్తున్న అదానీ.. అమెరికాలో అనేక అక్రమాలకు పాల్పడి, అనేక అడ్డదారులు తొక్కి మోసపూరితంగా సమీకరించిన డబ్బులను భారతదేశంలో సౌర విద్యుత్తు ఒప్పందాలు కుదుర్చుకోవడానికి నాలుగు రాష్ట్రాలకు లంచాలు ఇచ్చినట్టుగా అమెరికాలోని అత్యున్నత దర్యాప్తు సంస్థ ఎఫ్‌బిఐ నిగ్గు తేల్చింది. ఆ అవినీతిలో కళ్లు బైర్లు కమ్మలే చేసే అతిపెద్ద వాటా అప్పటి ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిదే కావడం గమనార్హం.
నాలుగు రాష్ట్రాలతో విద్యుత్తు ఒప్పందాలు కుదిర్చుకోవడానికి అదానీ సంస్థలు వారికి భారీ లంచాలను ఇచ్చాయని ఎఫ్‌బిఐ నిర్ధరించింది. మొత్తం 265 మిలియన్ డాలర్ల లంచాలు ఇచ్చినట్టు తేల్చారు. అంటే మొత్తం 2029 కోట్లు అన్నమాట. అంత మొత్తంలో కేవలం జగన్మోహన్ రెడ్డి ఒక్కడికే అందిన లంచాల విలువ ఎంతో తెలుసా? ఏకంగా 1750 కోట్లు!
సౌర విద్యుత్తు కొనుగోలుకు కేంద్రప్రభుత్వ రంగ సంస్థ సెకితో ఒప్పందాలు చేసుకోవడానికి తొలుత ఏపీ ప్రభుత్వం కూడా ముందుకు రాలేదు. మార్కెట్ లో ధరలకంటె ఆ విద్యత్తు ధరలు చాలా ఎక్కువగా ఉన్నాయని తిరస్కరించారు. అయితే గౌతం అదానీ వచ్చి జగన్ తో మూడుసార్లు సమావేశం అయిన తరువాత.. బేరం కుదిరిది. 2021 ఆగస్టు 7, సెప్టెంబరు 12, నవంబరు 20 తేదీల్లో ఈ భేటీలు జరిగాయి అప్పటికి బేరం తేలింది. చివరికి తొలివిడతగా ఏడువేల మెగావాట్ల విద్యుత్తును కొనుగోలు చేయడానికి జగన్ ప్రభుత్వం అంగీకరిస్తున్నట్టు ప్రకటన వచ్చింది. ఇదంతా కేవలం లంచాల ఫలితంగానే జరిగినట్టు ఎఫ్బీఐ తేల్చింది.
ఈ వ్యవహారంలో అమెరికాలో అదానీ గ్రూపునకు సంబంధించి పలువురి మీద కేసులు కూడా నమోదు అయ్యాయి. గౌతమ్ అదానీ, సాగర్ అదానీ సహా 8మందిపై కేసులు పెట్టారు. అదానీ, సాగర్ అదానీపై అరెస్టు వారంట్లు కూడా జారీ అయినట్టు అమెరికాలోని మీడియా సంస్థలు పేర్కొంటున్నాయి. ఈ వ్యవహారంపై వైఎస్సార్ కాంగ్రెస పార్టీ నాయకులు ఎలా స్పందిస్తారన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.