జగన్ చేసిన ద్రోహాన్ని తేల్చేసిన కేంద్రం!

విశాఖపట్నం రాష్ట్రానికి ఎగ్జిక్యూటివ్ రాజధాని అంటూ..   రాజధాని చేయడం ద్వారా యావత్తు ఉత్తరాంధ్రను ఉద్ధరించేస్తారని కబుర్లు చెబుతూ జగన్ మోహన్ రెడ్డి అక్కడి ప్రజలకు ఒరగబెట్టింది ఏమిటో అందరికీ తెలుసు. ఋషికొండను విధ్వంసం చేసి తాను నివాసం ఉండడానికి 600 కోట్లు తగలేయడం తప్ప ఆయన విశాఖకు చేసిందేమీ లేదని కూడా వారికి తెలుసు. కనీసం కేంద్ర ప్రభుత్వం విశాఖ రైల్వే జోన్ కేటాయిస్తే కార్యాలయాల నిర్మాణానికి సరైన స్థల కేటాయింపు కూడా చేయకుండా.. రాజధాని ప్రకటన తర్వాత అక్కడి భూములను తమ మనుషులతో కబ్జాలు చేయించడం తప్ప వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మరేమీ చేయలేదు. ఆ రకంగా విశాఖపట్నం నగరానికి  జగన్మోహన్ రెడ్డి చేసిన ద్రోహాన్ని ఇప్పుడు కేంద్రమే స్వయంగా బయటపెడుతోంది. రాష్ట్రంలోని చంద్రబాబు నాయుడు ప్రభుత్వం భూమి కేటాయింపు ఇతర అంశాలలో పూర్తి సహకారం అందిస్తున్నదని అతి త్వరలో రైల్వే జోన్ కేంద్ర కార్యాలయ నిర్మాణానికి అవసరమైన సన్నాహాలు ప్రారంభించడానికి సిద్ధంగా ఉన్నామని కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ వెల్లడించారు.

కేంద్ర మంత్రి ప్రకటనతోనే జగన్మోహన్ రెడ్డి గతంలో ఎలాంటి బూటకపు పరిపాలన సాగించారో మనకు అవగతం అవుతుంది. ఎందుకంటే విశాఖ రైల్వే జోన్ అనేది తెలుగు ప్రజల కల. రాష్ట్ర విభజన ద్వారా అది సాకారమైంది. రాష్ట్ర విభజన ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రానికి ఇచ్చిన ఒకటి రెండు వరాలలో అది ఒకటి. అయితే దానిని పొందడానికి కూడా సుదీర్ఘకాల పోరాటాలు చేయవలసి వచ్చింది. తొలిసారిగా గద్దెనెక్కిన చంద్రబాబునాయుడు ప్రభుత్వం అనేక ప్రయత్నాలు చేసిన తర్వాత, అది సాధ్యమైంది. విశాఖ రైల్వే జోన్ రాకుండా ఇతరులు, పొరుగు రాష్ట్రాల వారు ఎన్ని రకాలుగా అడ్డుకున్నప్పటికీ వారి అభ్యంతరాలన్నింటినీ ఆధిగమిస్తూ తొలిసారి ఏర్పడిన చంద్రబాబు ప్రభుత్వం అతి కష్టం మీద రైల్వే జోనును సాధించింది.

కానీ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత కనీసం దానికి భూమి కేటాయింపు కూడా చేయలేదు. దీంతో రైల్వే జోన్ వ్యవహారం మొత్తం ఎక్కడ వేసిన గొంగళి అక్కడనే అన్న చందంగా ఉండిపోయింది. ఇప్పుడు రాష్ట్రంలో డబల్ ఇంజిన్ సర్కార్ ఏర్పడడం కేంద్రంలో ఎన్డీఏతో రాష్ట్రంలోని చంద్రబాబు సారధ్యంలోని కూటమి ప్రభుత్వం మంచి సమన్వయంతో పని చేస్తూ ఉండడం రైల్వే జోన్ కు లాభసాటి పరిణామం. భూమి కేటాయింపు విషయంలో ప్రభుత్వం చురుగ్గా ఉండడంతో త్వరలోనే పనులు పూర్తవుతాయని కేంద్ర మంత్రి అంటున్నారు. ఇప్పుడు అడ్డంకులన్నీ తొలగిపోయాయి అంటున్నారు. గత ప్రభుత్వ హయాంలో కేటాయించిన భూమి విషయంలో అభ్యంతరాలు వచ్చాయని అందుకనే అడుగు ముందుకు పడలేదని అశ్విని వైష్ణవ్ వెల్లడించడం విశేషం.

Related Posts

Comments

spot_img

Recent Stories