జగనన్న తమ్ముడు జైలుకు వెళ్లక తప్పదా?

ఈ దేశంలో బెయిలు మీద బాహ్యప్రపంచంలో ఉంటూ అతి సుదీర్ఘకాలం ముఖ్యమంత్రిగా చెలామణీ అయిన వ్యక్తిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇప్పటికే రికార్డు సృష్టించారు. అలాగే ఆయన అనుంగు తమ్ముడు కూడా బెయిలు మీద బయటే ఉంటూ.. రాబోయే ఎన్నికల రాజకీయానికి తన వ్యూహాలకు పదును పెట్టుకుంటున్నాడు. అయితే.. వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో పోలీసులకు అప్రూవర్ గా మారిన, ఇప్పుడు వైఎస్సార్ కాంగ్రెస్ మరియు జగన్ వర్గీయులనుంచి బెదిరింపులు, వేధింపులు ఎదుర్కొంటున్న దస్తగిరి చేస్తున్న ఆరోపణల ప్రకారం చూసినట్లయితే.. జగనన్న తమ్ముడు అవినాష్ రెడ్డి.. జైలుకు వెళ్లక తప్పదేమో అనిపిస్తోంది. దస్తగిరి యొక్క ఆరోపణలు ఏదో ప్రెస్ మీట్ లో చేసినవి కాదు. ఏకంగా తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేస్తూ, అందులో సంచలన ఆరోపణలు చేశారు. అవినాష్ రెడ్డికి ప్రస్తుతం అమల్లో ఉన్న బెయిలును రద్దు చేయాలని కూడా కోరారు. అవినాష్ రెడ్డి బెయిలు మీద బయటే ఉంటూ వివేకానందరెడ్డి హత్య కేసులో సాక్షులను, సాక్ష్యాలను కూడా తారుమారు చేయడానికి ప్రయత్నిస్తున్నారనేది దస్తగిరి చేస్తున్న ప్రధాన ఆరోపణ! ఈ హత్య కేసులో తాను చెప్పిన సాక్ష్యాన్ని ఉపసంహరించుకోవడానికి 20 కోట్ల రూపాయలు తనకు ఆఫర్ చేశారంటూ దస్తగిరి ఆ పిటిషన్లో పేర్కొన్నారు. తాను కడప సెంట్రల్ జైల్లో ఉండగా, హత్య కేసులో మరో నిందితుడు దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి కుమారుడు చైతన్య రెడ్డి మెడికల్ క్యాంపెయిన్ పేరుతో జైల్లోకి వచ్చి తనను కలిశారని, 20 కోట్ల రూపాయలతో నేరుగా బ్యారక్ వద్దకు వచ్చి సాక్ష్యం ఉపసంహరించుకోవడానికి ఆఫర్ చేశారని అన్నారు. అలా చేస్తే తన భార్యా పిల్లలను జగన్, అవినాష్ చూసుకుంటారని అన్నారని లేకపోతే ఏం చేయడానికైనా సిద్ధం అంటూ హెచ్చరించారని చెప్పారు. మౌనంగా ఉంటే తన కుటుంబ సభ్యులకు ప్రభుత్వోద్యోగాలు కూడా ఇప్పిస్తామని చెప్పారన్నారు.

జైల్లో ఉండగా అవినాష్ అనుచరులు తనను చంపడానికి ప్రయత్నించారని, పులివెందుల మండలం నామాలగుండు గ్రామంలో ఈ నెల 8వ తేదీన రాత్రి తన తండ్రి మీద కూడా హత్యాయత్నం జరిగిందని దస్తగిరి ఆరోపించారు.

అవినాష్ రెడ్డి చేసిన ఆరోపణలు ఇప్పుడు సంచలనం అవుతున్నాయి. హత్య జరిగిన అయిదేళ్ల వ్యవధిలో కూడా కేసు ఒక కొలిక్కి రాకుండా సాగుతున్న వైనం ఇప్పటికే బహుధా వివాదాస్పదం అవుతుండగా.. అవినాష్ రెడ్డి వైఖరి, బెదిరింపుల గురించి దస్తగిరి ఏకంగా తెలంగాణ హైకోర్టులో పిటిషన్ వేయడం కీలకమైన సంగతి. సింగిల్ జడ్జి ఇచ్చిన బెయిలు ఉత్తర్వులను రద్దు చేయాలని దస్తగిరి అందులో ప్రధానంగా కోరారు. ఆ పిటిషన్ అంశాలను న్యాయస్థానం పరిగణనలోకి తీసుకుంటే అవినాష్ రెడ్డి బెయిలు రద్దవుతుంది. ఈసారి కడప ఎంపీగా ఆయన జైలునుంచే పోటీచేస్తారా? అనేది వేచిచూడాల్సి ఉంటుంది.

Related Posts

Comments

spot_img

Recent Stories