దేశం విడిచి పరారీకి ట్రై చేస్తున్న జగనన్న తమ్ముళ్లు!

అధికారం ఉన్నప్పుడు కన్నూమిన్నూ కానకుండా చెలరేగిపోయారు. తీరా ఇప్పుడు అధికారం చేతులు మారింది. ఏ జగనన్న ను చూసుకుని చట్టాన్ని నిబంధనలను పట్టించుకోకుండా వ్యవహరించారో.. అదే జగనన్న మీద ప్రజల్లో వెల్లువెత్తిన వ్యతిరేకగ పార్టీని నిండా ముంచేసిన తర్వాత వారందరికీ వెన్నులో వణుకు మొదలైనట్టుగా కనిపిస్తోంది. తాము చేసిన దురాగతాలకు సంబంధించి చాలా పకడ్బందీగా నమోదైన కేసులనుంచి తప్పించుకోవడం అసాధ్యం అనే ఉద్దేశంతో.. జగనన్న తమ్ముళ్లు ఏకంగా దేశం విడిచే పారిపోవాలని ప్లాన్ చేస్తున్నట్టుగా కనిపిస్తోంది.

చంద్రబాబునాయుడు నివాసం మీద జరిగిన దాడి వ్యవహారానికి సంబంధించి ప్రధాన నిందితుల్లో ఒకరైన దేవినేని అవినాష్.. దేశం విడిచి దుబాయి పారిపోవడానికి ప్రయత్నిస్తుండగా ఎయిర్ పోర్టు వర్గాలు అడ్డుకున్నాయి. ఆయనను అడ్డుకుని వారు మంగళగిరి పోలీసులకు సమాచారం ఇవ్వడం.. ఆయనపై క్రిమినల్ కేసులు ఉన్నందున ప్రయాణానికి అనుమతించవద్దంటూ పోలీసులు కోరడంతో అధికారులు దేవినేని అవినాష్ ను వెనక్కు తిప్పిపంపడం ఆటోమేటిగ్గా జరిగిపోయాయి. కోర్టులో ముందస్తు బెయిల్ రావడంతో అదే అవకాశంగా ఏకంగా విదేశాలకు పారిపోవడానికి చేసిన ప్రయత్నాలు బెడిసికొట్టినట్టుగా కనిపిస్తోంది.

జగన్మోహన్ రెడ్డి తాను ముఖ్యమంత్రిగా ఉండగా విచక్షణ లేకుండా, హద్దూ అదుపూ లేకుండా తన అనుయాయులు, తమ్ముళ్లతో దాడులు చేయించారు. జగనన్న కళ్లలో ఆనందం చూడడం ఒక్కటే జీవితాశయంగా వైసీపీ నేతలు చెలరేగిపోయారు. చంద్రబాబునాయుడు ఇంటి మీద, తెలుగుదేశం కార్యాలయం మీద  దాడులు చేయడంలో ఒకరితో ఒకరు పోటీపడినట్టుగా నాయకులు చెలరేగిపోయారు.

లేళ్ల అప్పిరెడ్డి, జోగి రమేష్, దేవినేని అవినాష్ తమ తమ అనుచర ముఠాలతో కలిసి విచ్చలవిడిగా దాడులకు పాల్పడ్డారు. అప్పట్లో తెలుగుదేశం నాయకులు కేసులు పెట్టినా కూడా పోలీసులు పట్టించుకోలేదు. తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పడిన తర్వాత.. మొత్తం కేసులను తిరగతోడారు. పక్కా ఆధారాలతో నాయకులపై కేసులు పెట్టి, ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. నాయకులు ముందస్తు బెయిల్ తెచ్చుకున్నారు.

అయితే మంగళగిరి పోలీసులు ముందుగానే వారి పేర్ల మీద లుక్ అవుట్ నోటీసులు జారీచేయడంతో ఇవాళ దేవినేని అవినాష్ దేశం విడిచి పారిపోకుండా అడ్డుకున్నట్టుగా అయింది. జగనన్న కోసం చెలరేగిన వారిలో ఇప్పుడు భయం మొదలైనట్టుగా తెలుస్తోంది.

Related Posts

Comments

spot_img

Recent Stories